దేశంలో మిగతా సినీ పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్ పరిస్థితి చాలా మెరుగే కానీ.. మన ఇండస్ట్రీ ఆశించిన స్థాయిలో అయితే సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ సందడి కనిపించడం లేదు. గత నెల రోజుల వ్యవధిలో రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజయ్యాయి కానీ.. ఏవీ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.
ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. సరైన టాక్ లేక సినిమాలు నిలబడలేదు. తిమ్మరసు మూవీకి ఓ మోస్తరు టాక్ వచ్చింది. వసూళ్లు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. రాజ రాజ చోర చాలా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అందుకు తగ్గట్లుగా కలెక్షన్లు లేకపోయాయి.
ఈ వారాంతంలో మూడు చిత్రాలు బాక్సాఫీస్ పరీక్షకు నిలిచాయి. కానీ అన్నింటికీ నిరాశ తప్పేలా లేదు. అన్నింట్లోకి ఎక్కువ అంచనాల మధ్య వచ్చిన సుధీర్ బాబు సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’.. ప్రేక్షకుల ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ కాలేకపోయింది. క్లైమాక్స్ మినహా సినిమాలో విశేషాలేమీ లేవని.. మరీ పాత స్టయిల్లో ఉందని ఈ సినిమా పట్ల ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 550 థియేటర్లలో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. తొలి రోజు కోటిన్నరకు అటు ఇటుగా గ్రాస్ వచ్చింది. వీకెండ్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.
ఇక సుశాంత్ సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ పరిస్థితి దాదాపు వాషౌట్ అన్నట్లే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన చిత్రమే అయినా.. ఎంచుకున్న పాయింట్‌ను డీల్ చేయడంలో గందరగోళం ఈ చిత్రానికి ప్రతికూలంగా మారింది. ‘ఐవీఎన్ఆర్’కు టాక్ బాగా లేదు. ఓపెనింగ్స్ కూడా రాలేదు. సుశాంత్ కెరీర్లో మరో డిజాస్టర్ చేరినట్లే అనిపిస్తోంది.
ఇక శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్ర పోషించిన ‘హౌస్ ఆరెస్ట్’ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. చాలా మామూలు కథాకథనాలతో సాగే ఈ పిల్లల సినిమా కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ లేవు. ఈ మూడు థియేట్రికల్ రిలీజ్‌లతో పోలిస్తే సోనీ లివ్ ఓటీటీ ద్వారా రిలీజైన ‘వివాహ భోజనంబు’ పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తి సంతృప్తినిచ్చే సినిమా కాకపోయినా.. అక్కడక్కడా కామెడీ బాగానే వర్కవుట్ కావడంతో టైంపాస్‌కు ఢోకా లేదనిపించేలా ఉండటంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకులు సానుకూలంగానే స్పందిస్తున్నారు.
This post was last modified on August 30, 2021 6:08 am
ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…