రాజమౌళి సినిమాలు ఓ పట్టాన విడుదల కావు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్ లు చేస్తూనే ఉంటారు. పెర్ఫెక్షన్ కోసం సినిమాలను చెక్కుతూనే ఉంటారు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. దానికి తోడు కరోనా రావడంతో సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. 2020లో సినిమాను విడుదల చేస్తామన్నారు. అలా జరగలేదు. ఈ ఏడాది దసరాకు వస్తుందని చాలా నమ్మకంగా చెబుతున్నారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాదిలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉండదట.
తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అక్టోబర్ నెలాఖరుకి గానీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ కాదట. అందుకే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజానికి ‘ఆర్ఆర్ఆర్’ దసరాకి వస్తుందని అనౌన్స్ చేయడంతో టాలీవుడ్ స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఇలా చాలా సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చాయి.
ఇప్పుడు రాజమౌళి మళ్లీ తన సినిమా డేట్ ని మార్చుకొని సంక్రాంతికి రావాలని చూస్తుండడంతో మిగిలిన చిత్ర నిర్మాతల పరిస్థితి అయోమయంగా మారింది. సంక్రాంతి సీజన్ ను మిస్ చేసుకుంటే మళ్లీ సమ్మర్ వరకు ఎదురుచూడాలి. అప్పటివరకు సినిమాలను వాయిదా వేయలేరు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. నిర్మాత దానయ్య మాత్రం సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ వస్తుందనే సంకేతాలు ఇస్తున్నారట. మరి అప్పటికి ఎన్ని సినిమాలు డ్రాప్ అవుతాయో.. ఎన్ని పోటీకి నిలబడతాయో చూడాలి!
This post was last modified on August 28, 2021 3:59 pm
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…