మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరు ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ సినిమా తరువాత బాబీతో ఓ సినిమా అలానే మెహర్ రమేష్ తో మరో సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు నాడు ఈ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను రివీల్ చేశారు. చిరు-బాబీ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది.
చిరు మాస్ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. మొదటినుండి కూడా దీనికి ‘వీరయ్య’ అనే టైటిల్ అనుకుంటున్నారు. బాబీ కూడా అదే టైటిల్ తో కథ రాసుకున్నాడు. చిరు కూడా ఓకే చెప్పారు కానీ ఇప్పుడు ‘వీరయ్య’ టైటిల్ మరీ పాత వాసన కొడుతుందని.. మార్చమని దర్శకుడికి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చిరు పుట్టినరోజు నాడు టైటిల్ ప్రకటించలేదు.
ఇప్పుడు సినిమాకి కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అదేంటంటే ‘వాల్తేర్ శీను’. చిరుకి కూడా ఈ టైటిల్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారట. సరైన సమయం చూసుకొని ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయాలని చూస్తున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించబోతున్నారు. చిరు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు.
This post was last modified on August 26, 2021 12:02 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…