ఇండియాలో వివిధ భాషల్లో బిగ్గెస్ట్ హిట్టయిన టీవీ షో అంటే ‘బిగ్ బాస్’యే. విదేశాల నుంచి అరువు తెచ్చుకున్న కాన్సెప్ట్ అయినప్పటికీ.. మన దగ్గర ఇది బాగానే క్లిక్ అయింది. హిందీలో దశాబ్దంన్నర కిందటే ఈ షో మొదలు కాగా.. సీజన్ సీజన్‌కూ దీని ఆదరణ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. తెలుగులో కూడా నాలుగేళ్ల కిందట మొదలైన ఈ షో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.
ప్రతి సీజన్‌కూ వీక్షకుల సంఖ్య పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ఐదో సీజన్ మీద కొంచెం సందేహాలు ముసురుకున్నాయి కానీ.. ఆ సందేహాల్ని పటా పంచలు చేస్తూ ఈ మధ్య కొత్త సీజన్ ప్రోమోను వదిలింది ‘బిగ్ బాస్’ టీం. ఐతే షో ఎప్పుడు మొదలవుతుందనే స్పష్టతే ఇవ్వలేదు. ఆ విషయంలో ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు ఆ సస్పెన్సుకు తెరపడిపోయింది. సెప్టెంబరు 5న, ఆదివారం బిగ్ బాస్-5 శ్రీకారం చుట్టుకోనుంది. ఈ మేరకు ‘స్టార్ మా’ ప్రకటన చేసింది.
సెప్టెంబరు 5న సాయంత్రం 6 గంటలకు షో మొదలు కానుంది. అంటే ఇంకో పది రోజుల్లోనే షో మొదలవుతుందడంతో ఇక పార్టిసిపెంట్లు ఎవరనే విషయంలో ఊహాగానాలు జోరందుకుంటాయనడంలో సందేహం లేదు. సీనియర్ నటి సురేఖా వాణి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ సహా ఇప్పటికే చాలా పేర్లు ప్రచారంలోకి రావడం తెలిసిందే. మరి వీరిలో ఎంతమంది ‘బిగ్ బాస్’ హౌస్‌లో కనిపించనున్నారో చూడాలి.
ఈసారి ‘బిగ్ బాస్’ను ఓటీటీలో కూడా ప్రసారం చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. గత సీనజన్లన్నింటికంటే ఆకర్షణీయంగా కొత్త సీజన్‌ను ప్రెజెంట్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ‘బిగ్ బాస్’ తొలి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ నడిపించగా.. రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు. మూడో సీజన్ నుంచి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆయనకిది హ్యాట్రిక్ సీజన్.
This post was last modified on August 26, 2021 11:51 am
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…