అందగాడు కాదు. ఆ మాటకు వస్తే అంత ఫిట్ గా కూడా ఉండడు. సాదాసీదా పక్కింటి కుర్రాడిగా ఉంటాడు. అదే అతనికి వరమైంది. సెలబ్రిటీని చేయటమే కాదు.. ఇవాల్టి రోజున ప్రతి తెలుగింట్లోనూ సుపరిచితడు. అతడే.. సుడిగాలి సుధీర్. జబర్దస్త్ షో ద్వారా పరిచయమై.. తక్కువ కాలంలోనే ఆల్ రౌండర్ గా పేరును సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్.. తాజాగా ఒకషోలో తన ఆస్తుల లెక్క చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
గతంలో హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో పడుకోవటానికి ప్లేస్ లేక.. రైల్వేస్టేషన్ లో పడుకున్న సుధీర్.. తాజాగా తాను కూడేసిన ఆస్తులు లిస్టు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఒకవైపు టీవీ షోలు.. మరోవైపు ఈవెంట్లలో పాల్గొనటం.. ఇంకోవైపు సినిమాల్లో నటిస్తున్న సుడిగాలి సుధీర్.. తాజాగా తన ఆస్తులు ఎంతన్నది చెబుతూ.. హైదరాబాద్ లో తాను రెండు సొంతిళ్లను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. అంతేకాదు..పలు స్థిరాస్తులు కూడా ఉన్నాయని చెప్పాడు. హైదరాబాద్ మహానగరంలో ఇల్లు ఉంటే చాలు అనుకునే స్థాయి నుంచి రెండు ఇళ్లను సొంతం చేసుకోవటానికి మించింది ఏముంటుంది?
అంతేకాదు.. బాగానే కూడబెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి సున్నాతో జీవితాన్ని మొదలు పెట్టి.. కష్టంతో తనకంటూ ఒక ఇమేజ్ ను సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ను అభినందించాల్సిందే. అతడు చేసే కామెడీ.. అమ్మాయిల పిచ్చి మొత్తం రీల్ కు మాత్రమే పరిమితమని.. రియల్ జీవితంలో సక్సెస్ ఫుల్ అన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశాడని చెప్పాలి.
This post was last modified on August 26, 2021 10:56 am
చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…