ఒప్పందం కుదుర్చుకున్న మూడు సినిమాలు!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు బయటకు రాగానే ఇండస్ట్రీలో పెద్ద రచ్చ జరిగింది. సెప్టెంబర్ 10న థియేటర్లలో ‘లవ్ స్టోరీ’ విడుదలవుతుందని మేం ప్రకటించిన తరువాత అదే రోజు ఓటీటీ వేదికపై ‘టక్ జగదీష్’ ఎలా రిలీజ్ చేస్తారు..? థియేటర్ల వ్యవస్థను చంపేస్తారా..? అంటూ సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఆయనకు మద్దతుగా తెలంగాణ థియేటర్ల సంఘం హీరో నానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ వివాదం సద్దుమణిగింది.

తాజా సమాచారం ప్రకారం.. ‘టక్ జగదీష్’, నితిన్ ‘మ్యాస్ట్రో, ‘లవ్ స్టోరీ’.. ఈ మూడు సినిమాల మధ్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ‘లవ్ స్టోరీ’ సినిమా చెప్పినట్లే సెప్టెంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇక సెప్టెంబర్ 9న హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావాల్సిన ‘మ్యాస్ట్రో’ రెండు రోజులు ఆలస్యంగా.. సెప్టెంబర్ 10న అమెజాన్ లో విడుదల కావాల్సిన ‘టక్ జగదీష్’ ఆ తరువాత వారం వచ్చేలా మాట్లాడుకున్నారట.

ఈ డీల్ నిర్మాతల మధ్య జరిగింది. దానికి స్ట్రీమింగ్ కంపెనీలు కూడా ఒప్పుకోవాల్సివుంది. స్ట్రీమింగ్ సైట్ లు నిర్మాతల రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. ‘మ్యాస్ట్రో’ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్న హాట్ స్టార్ మాత్రం డీల్ కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి అమెజాన్ కూడా ఒప్పుకుంటుందేమో చూడాలి!