ఇండస్ట్రీలో ఉన్న దళితులను తరిమేయాలని.. వారి కారణంగానే సరైన సినిమాలు రావడం లేదని బిగ్ బాస్ ఫేమ్ మీరా మిథున్ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. షెడ్యూల్డ్ కులాల వారు మీరా మిథున్ పై కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద సెక్షన్ 153A(1)(a), 505(1)(b), 505 (2) ప్రకారం ఆమెపై కేసులు నమోదయ్యాయి. మీరా మిథున్ ని అరెస్ట్ చేయడం ఖాయమని అన్నారు.
దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఏకంగా పోలీసులకు సవాలు విసురుతూ హాట్ కామెంట్స్ చేసింది. తనను అరెస్ట్ చేయడమనేది కలలో కూడా జరగదని.. పోలీసులకు దమ్ముంటే తనను అరెస్ట్ చేసి చూపించమంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఇన్ని మాటలు చెప్పిన మీరా మిథున్ తనను అరెస్ట్ చేసే సూచనలు ఉన్నాయని గ్రహించి ముందుగానే భయపడి పారిపోయింది.
ఆమె కోసం అన్ని ప్రాంతాలు వెతికిన పోలీసులు కేరళలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులు కేరళకు వెళ్లి ఆమెని అరెస్ట్ చేశారు. ఆ తరువాత చెన్నైకి తీసుకొచ్చి రిమాండ్ కి తరలించారు. దీంతో ఆమె బెయిల్ కోసం అప్లై చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమె స్నేహితుడు కూడా పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె బెయిల్ కి నిరాకరించింది. దీంతో ఆమె మరికొన్ని రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తదుపరి విచారణ జరిగే వరకూ మీరా మిథున్ కి ఈ తిప్పలు తప్పవు!
This post was last modified on August 25, 2021 12:05 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…