ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి బలమైన గాయమైంది. ఆ సమయంలో ట్రీట్మెంట్ అందించారు. కానీ తాజాగా మరోసారి ఆ గాయం తిరగబడడంతో ఆయన్ని ముంబై లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అభిషేక్ కానీ బచ్చన్ ఫ్యామిలీ కానీ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.
అయితే హాస్పిటల్ లో ఉన్న కొడుకును చూడడానికి అమితాబ్ బచ్చన్ తన కూతురు శ్వేతా బచ్చన్ తో కలిసి హాస్పిటల్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా ఐశ్వర్యారాయ్ మాత్రం కనిపించలేదు. అభిషేక్ ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్ కి రాకపోవడం ఏంటంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఐశ్వర్యారాయ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవల మధ్యప్రదేశ్ వెళ్లిన ఐశ్వర్య ఇప్పుడు తిరిగి ముంబైకి చేరుకుంది. అయితే ఆమె హాస్పిటల్ వద్ద కనిపించకపోవడంతో అభిషేక్ ని ఆమె పట్టించుకోవడం లేదంటూ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
This post was last modified on August 24, 2021 1:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…