స్టార్ హీరోల్లో ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రత్యేకమైన మేనరిజమ్స్ ఉంటాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెడపై చేతిని రుద్దడంలో ఒక స్టైల్ ఉంటుంది. విక్టరీ వెంకటేష్ వేలిని కాస్త వంకరగా పెట్టి స్టైల్ చూపిస్తాడు. ఇలా ఒక్కో హీరోకు ఒక్కో రకమైన స్టైల్ లేదా మేనరిజం ఉంటుంది.
మహేష్ బాబు విషయానికి వస్తే అతను నిలకడగా ఒక స్టైల్ మెయింటైన్ చేస్తున్నదైతే.. పరుగెత్తే విషయంలోనే. అతడి పరుగులో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. చేతుల్ని ఊపే తీరే వేరుగా ఉంటుంది. పోకిరి సినిమాతో ఈ స్టైల్ బాగా పాపులర్ అయింది.
ఈ మధ్య మహర్షిలోనూ అదే స్టయిల్లో పరుగెత్తి అభిమానులకు నోస్టాల్జిక్ ఫీలింగ్ తెచ్చాడు. ఐతే మహేష్ సహజంగానే అలా పరుగెడతాడా.. లేక ఉద్దేశపూర్వకంగా ఆ స్టయిల్ మెయింటైన్ చేస్తాడా అనే విషయంలో స్పష్టత లేదు.
ఐతే తాజాగా మహేష్ వర్కవుట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి వచ్చింది. లాక్ డౌన్ టైంలో మహేష్ థ్రెడ్ మిల్ మీద పరుగెడుతున్న వీడియో తీసి దాన్ని అతడి భార్య నమ్రత శిరోద్కర్ ఇన్‌స్టాగ్రాంలో అభిమానులతో పంచుకుంది. మహేష్‌కు సంబంధించి వర్కవుట్ వీడియో బయటికి రావడం ఇదే తొలిసారి.
అందులో మహేష్ పరుగెత్తుతున్న సినిమాల్లో పరుగునే గుర్తుకు తెస్తోంది. దీన్ని బట్టి మహేష్ సహజంగానే ఇలా పరుగెడుతాడని.. అది స్టైల్ కోసం సెట్ చేసుకున్నది కాదని అర్థమవుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్‌కు సంబంధించి గత రెండు నెలల్లో ఎన్నో పర్సనల్ ఫొటోలు, వీడియోలు బయటికి వచ్చాయి. అవి అభిమానులను బాగా అలరిస్తున్నాయి. లేటెస్ట్ వర్కవుట్ వీడియో కూడా ఆ కోవలోనిదే.
This post was last modified on May 28, 2020 4:32 pm
స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…
అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అనధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…