ఈ ఆదివారం మెగా అభిమానులకు పండుగ రోజు. ఎందుకంటే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంత సందడి కనిపిస్తోంది సామాజిక మాధ్యమాల్లో. చిరు నటిస్తున్న రెండు చిత్రాలకు తోడు.. రాబోయే రెండు చిత్రాల విశేషాలను ఈ రోజు పంచుకోవడంతో సోషల్ మీడియా చిరు నామ స్మరణతో హోరెత్తిపోతోంది.
అలాగే చిరంజీవి పాత సినిమాల వీడియోలతో, ఆయన మీద ప్రత్యేకమైన పోస్టులతో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇంకా చిరు పుట్టిన రోజు నేపథ్యంలో సుమ ఆధ్వర్యంలో ట్విట్టర్ స్పేస్ కూడా పెట్టారు. ఈ సందడిలా సాగుతుండగానే ఒక వీడియో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది. మెగా అభిమానులకు అది మామూలు కిక్ ఇవ్వట్లేదు.
ఎందుకంటే అందులో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు వారి ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. ఆదివారం చిరు పుట్టిన రోజు నాడే రాఖీ పౌర్ణమి పండుగ కూడా వచ్చింది. దీంతో మెగా బ్రదర్స్, సిస్టర్స్ అంతా చిరు ఇంట్లో కలిశారు. ఇద్దరు సిస్టర్స్ ముగ్గురు బ్రదర్స్‌కు రాఖీలు కట్టి వారి నుంచి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు అందుకున్నారు.
మెగా బ్రదర్స్ ఇలా కలవడం అరుదే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడో కానీ అన్నయ్యలతో కనిపించడు. ముగ్గురూ కూడా చాలా ఉల్లాసంగా, సంతోషంగా కనిపించడం.. చాలా చాలా క్యాజువల్‌గా గడుపుతున్నట్లుగా వీడియోలో దర్శనమివ్వడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా అభిమానులనే సహా అందరినీ ఆకట్టుకుంటోంది. వీడియోలో ఒక చోట నాగబాబుకు ఆయన సోదరి రాఖీ కడుతుంటే.. వెనుక పవన్ కళ్యాణ్ లోపలి నుంచి నీళ్లు తీసుకొచ్చి తన చిరు-సురేఖలకు అందిస్తున్న దృశ్యం అభిమానులను మరింతగా ఆకర్షిస్తోంది.
This post was last modified on August 22, 2021 10:12 pm
కెజిఎఫ్, సలార్ తో టాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరైన సంగీత దర్శకుడు రవి బస్రూర్ మెగా ఫోన్ చేపట్టాడు. ఈయన డైరెక్షన్…
రాష్ట్రంలో `నాడు-నేడు` అనే మాట వినిపించగానే చటుక్కున జగనే గుర్తుకు వస్తారు. తన పాలన ప్రారంభం నుంచి ఆయన నాడు-నేడు…
ఏపీ సీఎం చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా…
సరిగ్గా పాతికేళ్ల క్రితం 2000 సంవత్సరం. పూరి జగన్నాధ్ అనే కొత్త దర్శకుడికి అవకాశమిచ్చిన పవన్ కళ్యాణ్ బద్రి విడుదల…
విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న కింగ్ డమ్ విడుదల మే 30…
ఇప్పటిదాకా వదిలిన ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పైకి తీసుకెళ్లలేకపోయిన విశ్వంభర కోసం తెర వెనుక చాలా పెద్ద కసరత్తే జరుగుతోంది.…