సెకండ్ ఇన్నింగ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి మామూలు ఊపులో లేడు. సైరా నరసింహారెడ్డి కోసం కొంచెం ఎక్కువ సమయం వెచ్చించిన చిరు.. ఆ తర్వాత చకచకా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. ఒక్కొక్కటిగా పట్టాలెక్కించేస్తున్నాడు. కరోనా కారణంగా ఆచార్య కొంచెం ఆలస్యమైనప్పటికీ.. సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత ఆ సినిమా పని పూర్తయిపోయింది.
ఇటీవలే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌ను మొదలుపెట్టడం తెలిసిందే. ఆ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే పేరు ఖరారు చేస్తూ ఈ రోజు ప్రి లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆదివారం చిరంజీవి పుట్టిన రోజును పురస్కరించుకుని అభిమానులకు ఈ చిత్ర బృందం ఈ కానుక ఇచ్చింది. దీంతో పాటు ఆచార్య నుంచి ఏదో ఒక విశేషాన్ని పంచుకోబోతోంది చిత్ర బృందం.
అలాగే బాబీ దర్శకత్వంలో చిరు నటించనున్న 154వ సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరు చేయనున్న 155వ సినిమా నుంచి కూడా అభిమానులకు కానుకలు అందబోతున్న సంగతి ఖరారైంది. ఇక్కడి వరకు ముందు నుంచి అంచనాలు ఉన్నాయి కానీ.. ఇప్పుడో కొత్త సర్ప్రైజ్ కూడా రాబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. యువ దర్శకుడు మెగాస్టార్ కోసం ఒక కథ రెడీ చేసి ఆయనకు వినిపించినట్లు ఇటీవలే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని.. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని.. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.
మారుతి లాంటి ట్రెండీ డైరెక్టర్ చిరును డైరెక్ట్ చేస్తే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. మారుతికి కూడా ఇది చాలా పెద్ద అవకాశం అవుతుంది. యువి వాళ్ల స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఆదివారం చిరు 156 గురించి నిజంగానే అనౌన్స్‌మెంట్ ఉంటుందేమో చూడాలి.
This post was last modified on August 22, 2021 6:08 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…