Movie News

పాపం.. ఉన్న క‌ష్టాలు చాల‌వ‌ని

క‌రోనాతో అన్ని భాష‌ల‌ సినిమా ప‌రిశ్ర‌మ‌లూ గ‌ట్టి దెబ్బ‌లే తిన్నాయి కానీ.. బాలీవుడ్‌కు త‌గిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్‌కు మ‌ధ్య‌లో తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ మోస్త‌రుగానే కోలుకున్నాయి. ఇక్క‌డ రిలీజైన సినిమాలు బాగానే ఆడాయి. వ‌సూళ్లు రాబ‌ట్టాయి. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ ప‌రిస్థితి లేదు. ఏదో నామ‌మాత్రంగా కొన్ని చిత్రాలు రిలీజ‌య్యాయి. అవేవీ ఆశించిన ఫ‌లితాల‌నివ్వ‌లేదు. ఉత్త‌రాదిన చాలా వ‌ర‌కు థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగాయి.

ఇంతలోనే సెకండ్ వేవ్ వ‌చ్చి మ‌రోసారి థియేట‌ర్ల‌ను మూత వేయించింది. మ‌ళ్లీ ఇప్ప‌టిదాకా ఉత్త‌రాది రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో థియేట‌ర్లు తెరుచుకోలేదు. అయినా స‌రే.. ధైర్యం చేసి అక్ష‌య్ కుమార్ సినిమా బెల్ బాట‌మ్‌ను ఈ గురువారం రిలీజ్ చేశారు. బాలీవుడ్‌కు కేంద్ర‌మైన ముంబ‌యిలో థియేట‌ర్లు మూత‌ప‌డి ఉండ‌గా ఈ సినిమా రిలీజ‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డే కాక ఉత్త‌రాదిన మ‌రి కొన్ని రాష్ట్రాల్లో థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు కొన‌సాగుతుండ‌టంతో ఓపెనింగ్స్‌పై బాగా ప్ర‌భావం ప‌డింది.

తొలి రోజు అక్ష‌య్ సినిమాలు ఇండియాలో దాదాపు 20 కోట్లు వ‌సూలు చేస్తాయి మామూలుగా. కానీ ఈ చిత్రానికి మూడు కోట్ల లోపే నెట్ వ‌సూళ్లు వ‌చ్చాయి. సినిమాకు యావ‌రేజ్ టాక్ ఉండ‌టం, థియేట‌ర్ల‌పై ఆంక్ష‌లు, జ‌నాలు ఇంకా థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసే మూడ్‌లోకి రాక‌పోవ‌డం ఇందుక్కార‌ణం.

ఇంత‌టి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత‌ల‌కు ఇంకో పెద్ద కష్టం వ‌చ్చి ప‌డింది. రిలీజ్ రోజే బెల్‌బాట‌మ్ ఆన్ లైన్లోకి వ‌చ్చేసింది. త‌మిళ్ రాక‌ర్స్, ఫిల్మీవ్యాప్ లాంటి పైర‌సీ వెబ్ సైట్ల‌లో ఈ చిత్రాన్ని లీక్ చేసేశారు. మంచి ప్రింట్ అందుబాటులోకి రావ‌డంతో ఇక ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఏం సినిమా చూస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ చేయడానికి మిగ‌తా నిర్మాత‌లు ఏం ధైర్యం చేస్తారు?

This post was last modified on August 21, 2021 7:14 am

Share

Recent Posts

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

1 minute ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

28 minutes ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

36 minutes ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

2 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

3 hours ago

ఐకానిక్ షోకు తెర‌… చివ‌రి సీజ‌న్లో అల్లు అర్జున్‌?

ఇండియాలో వివిధ భాష‌ల్లో అనేక టాక్ షోలు ఉన్నాయి. అందులో అత్యంత పాపుల‌ర్ ఏది అంటే బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత…

4 hours ago