బంగార్రాజు.. బంగార్రాజు.. ఐదేళ్లుగా మీడియాలో నానుతున్న పేరిది. 2016 సంక్రాంతికి విడుదలై అక్కినేని నాగార్జున కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలో హైలైట్‌గా నిలిచిన బంగార్రాజు పాత్రను తీసుకుని ఆ చిత్రాన్ని ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తీయాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు.
తన సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే ఈ సినిమా తీయడానికి నాగార్జున కూడా ఎప్పుడో రెడీ అయ్యాడు. కానీ ఆ స్క్రిప్టు ఎంతకీ తెగలేదు. నాగార్జున ఎంతకీ సంతృప్తి చెందట్లేదు. స్క్రిప్టు ఓకే అయిపోయింది.. సినిమా పట్టాలెక్కడమే తరువాయి అని ఇప్పటికి ఎన్నిసార్లు వార్తలొచ్చాయో. ముందు ఈ వార్త బయటికి వచ్చాక.. నాగ్ సంతృప్తిగా లేడని.. మరింత కసరత్తు చేయమన్నాడని.. సీనియర్ రైటర్ సత్యానంద్ సాయంతో కళ్యాణ్ కుస్తీలు పడుతున్నాడని కూడా బోలెడన్నిసార్లు ప్రచారం జరిగింది.
ఐతే ఈ మధ్య స్క్రిప్టు పక్కాగా తయారైందని.. త్వరలోనే సినిమా మొదలువుతుందని వార్తలు వచ్చినా.. గత అనుభవాల దృష్ట్యా ప్రేక్షకులకు నమ్మకం కలగలేదు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ, నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. వరలక్ష్మి వ్రత శుభదినాన, శుక్రవారం సినిమాకు ముహూర్త వేడుక జరిపింది చిత్ర బృందం. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా పాల్గొనడంతో ఈ చిత్రంలో అతను కూడా నటించబోతున్నాడని ఖరారైంది. అలాగే ‘ఉప్పెన’ భామ కృతి శెట్టి కూడా ఈ వేడుకకు హజరైంది. దీంతో ఆమె చైతూకు జోడీ అని తేలిపోయింది. నాగార్జునకు జోడీగా ‘సోగ్గాడే..’లో నటించిన రమ్యకృష్ణనే కనిపించబోతోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో పాటు రైటర్ సత్యానంద్ కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
‘సోగ్గాడే..’కు మంచి సంగీతాన్నందించిన అనూప్ రూబెన్సే ‘బంగార్రాజు’కు కూడా పని చేయబోతున్నాడు. నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేసి వీలును బట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్లో నాగ్ ఉన్నాడు. భీమ్లా నాయక్, సర్కారువారి పాట, రాధేశ్యామ్ లాంటి భారీ చిత్రాలు సంక్రాంతికి బెర్తులు ఖరారు చేసుకున్నప్పటికీ.. వాటిలో ఏదైనా వెనక్కి తగ్గినా లేదంటే థియేటర్లు సర్దుబాటు అయినా ‘బంగార్రాజును’ సంక్రాంతికే రిలీజ్ చేయాలని నాగ్ చూస్తున్నాడు.
This post was last modified on August 20, 2021 2:28 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…