కాస్త బ్యాగ్రౌండ్ ఉంటే చాలు.. హీరోలుగా అడుగు పెట్టిన వాళ్లు వరుసగా ఫ్లాపులు వచ్చినా తట్టుకోగలరు. మళ్లీ అవకాశాలు అందుకోగలరు. కానీ హీరోయిన్ల విషయంలో ఇలా కాదు. వాళ్లకు వరుసగా మూణ్నాలుగు ఫ్లాపులు పడ్డాయంటే డిమాండ్ తగ్గిపోతుంది. అందులోనూ కెరీర్ ఆరంభంలోనే పరాజయాలు పలకరిస్తే కెరీర్ ముందుకు సాగడం చాలా కష్టం. కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలుస్తారు. మేఘా ఆకాష్ ఆ కోవకే చెందుతుంది. ఆమె తమిళం, తెలుగు, హిందీలో కలిపి ఇప్పటికే దాదాపు పది సినిమాల్లో నటించింది.
తన తొలి చిత్రం ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ (తెలుగులో తూటా) మొదలైన నాలుగేళ్లకు కానీ నోచుకోలేదు. చివరికది రిలీజైనా తిరస్కారానికే గురైంది. దాని కంటే ముందు తెలుగులో చేసిన లై, ఛల్ మోహన్ రంగ తీవ్ర నిరాశకు గురి చేశాయి. తమిళంలో ‘పేట’ సహా ఆమె చేసిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. హిందీలో నటించిన శాటిలైట్ శంకర్, రాధె తుస్సుమనిపించాయి. ఐతే ఇన్ని సినిమాలు నిరాశ పరిచినా.. మేఘాకు అవకాశాలైతే ఆగిపోలేదు. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉండే ఈ అమ్మాయికి మంచి ఛాన్సులే వస్తున్నాయి. ఐతే అవకాశాలు ఎన్ని వచ్చినా ఏదో ఒక సినిమాతో నిఖార్సయిన హిట్టు కొడితేనే కదా ఎవరికైనా ఆనందం. ఆ ఆనందం మేఘాకు ఎట్టకేలకు వచ్చింది.
తెలుగులో ఆమె నటించిన కొత్త చిత్రం ‘రాజ రాజ చోర’ గురువారమే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. ముందు రోజు రాత్రి ప్రిమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ రాగా.. ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా చూసిన వాళ్లందరూ ప్రశంసలు కురిపించారు. రివ్యూలన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. మౌత్ టాక్ బాగుండటంతో వీకెండ్లో ఈ సినిమా బాగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నందుకునేలా ఉంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో ఇదే నిఖార్సయిన తొలి హిట్ అని చెప్పొచ్చు. ఇది చిత్ర బృందానికి అమితాన్నందాన్నిచ్చే విషయమే. ఇక మేఘా ఆనందం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రంలో సంజనగా చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది మేఘా. తన నటన కూడా ఓకే. తొలి విజయాన్నందుకున్న ఊపులో మేఘా ఇంకా బిజీ అవుతుందేమో చూడాలి.
This post was last modified on August 20, 2021 7:10 am
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…