తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీస్టార్ట్ అయి మూడు వారాలు గడుస్తోంది. ఐతే ఇంకా అనుకున్నంతగా వాటిలో కళ కనిపించట్లేదు. ఇప్పటిదాకా వచ్చిన కొత్త చిత్రాలేవీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఎస్ఆర్ కళ్యాణమండపం, పాగల్ చిత్రాలకు కొంత హంగామా కనిపించింది కానీ.. అదంతా తొలి రోజు వరకే. ముఖ్యంగా చెప్పాలంటే మార్నింగ్ షోలకే సందడి పరిమితం అయింది.
ఈ రెండు చిత్రాలూ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేయలేకపోయారు. తిమ్మరసు పర్వాలేదనిపించింది కానీ.. దానికి థియేటర్లలో పెద్దగా హడావుడి లేదు. ఈ వారం రానున్న సినిమాల్లో ‘రాజ రాజ చోర’ పరిస్థితి పర్వాలేదు. ఆ తర్వాతి వారం శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు సినిమాలపై ఆసక్తి ఓ మోస్తరుగా ఉంది కానీ.. టాలీవుడ్‌కు అసలైన ఊపు తెస్తాయనే ఆశ వీటిపై లేదు.
స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్లు నటించి.. మంచి క్రేజ్ ఉన్న సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అలాంటి సినిమా వస్తేనే బాక్సాఫీస్‌కు అసలైన కిక్కు. ‘లవ్ స్టోరి’ కచ్చితంగా ఆ తరహా సినిమానే. కరోనా సెకండ్ వేవ్ ఎటాక్ లేకుంటే ఏప్రిల్ 16నే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కానీ అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడి.. థియేటర్లు పున:ప్రారంభం అయ్యాక మంచి టైమింగ్ కోసం ఎదురు చూస్తోందీ చిత్రం. నెమ్మదిగా పరిస్థితులు మెరుగవుతుండటం.. ఏపీలో టికెట్ల రేట్ల గొడవ కూడా పరిష్కారం అయ్యేలా కనిపిస్తుండటం ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఇచ్చారు.
సెప్టెంబరు 10న ఈ శేఖర్ కమ్ముల సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య మరీ పెద్ద స్టార్ కాకున్నా.. అతను సాయిపల్లవితో జోడీ కట్టడం.. ‘ఫిదా’ తర్వాత కమ్ముల తీసిన సినిమా కావడం.. దీని పాటలు, ఇతర ప్రోమోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఓ పెద్ద సినిమా స్థాయిలో దీనికి క్రేజ్ ఉంది. ఈ చిత్రం వస్తే బాక్సాఫీస్‌కు అసలైన ఊపు వస్తుందని.. టాలీవుడ్‌కు మళ్లీ మంచి రోజులు మొదలైనట్లే అని అంచనా వేస్తున్నారు.
This post was last modified on August 18, 2021 1:19 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…