ఆగస్టు 22.. మెగాస్టార్ అభిమానులందరికీ ఒక పండుగ రోజు. ఆ రోజు చిరంజీవి పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. మధ్యలో సినిమాలకు దూరంగా ఉన్న పదేళ్లను పక్కన పెడితే.. మిగతా సమయాల్లో ప్రతి ఏటా ఆ రోజు ఏదో రకంగా ఆయన సినిమాల సందడి పక్కా. అందులోనూ రీఎంట్రీ తర్వాత చిరు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది చాలా సినిమాలే లైన్లో పెట్టారు. ఆల్రెడీ చేస్తున్న రెండు సినిమాలకు తోడు.. మరో రెండు చిత్రాలు ఖరారయ్యాయి. ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌తో ఈ ఆగస్టు 22న సోషల్ మీడియా హోరెత్తబోతోందని సమాచారం.
ఆచార్య సినిమా నుంచి ఒక వీడియో గ్లింప్స్‌తో చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పబోతోందట చిత్ర బృందం. ఇక చిరు ఇటీవలే మొదలుపెట్టిన లూసిఫర్ రీమేక్‌కు సంబంధించి ఫస్ట్ లుక్ లాంచ్ పక్క అంటున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను కూడా అదే రోజు ప్రకటిస్తారేమో చూడాలి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరు చేయనున్న సినిమా గురించి ఒక పోస్టర్‌తో అధికారిక ప్రకటన ఇస్తారంటున్నారు. ఈ సినిమాలో చిరు లుక్‌ను కూడా రిలీజ్ చేస్తారంటున్నారు. దానిపై క్లారిటీ లేదు.
ఇంకోవైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు చేయనున్న కొత్త చిత్రం నుంచి కూడా ఓ అప్‌డేట్ పక్కా అని మెగా ఫ్యామిలీ సన్నిహిత పీఆర్వో ఒకరు ట్విట్టర్లో వెల్లడించారు. దీంతో పాటుగా కామన్ డీపీ, స్పేస్, స్పెషల్ ట్రెండ్స్ లాంటి అభిమానులను అలరించే సోషల్ మీడియా కార్యక్రమాలు కూడా ఆగస్టు 22న సందడి చేయబోతున్నాయి. మొత్తంగా ఆ రోజంతా సోషల్ మీడియా చిరు నామస్మరణతో హోరెత్తబోతోందన్నది స్పష్టం.
This post was last modified on August 18, 2021 10:25 am
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…