సోషల్ మీడియా జనాలు ఖాళీగా ఉండలేరు. అవసరం లేని శత్రుత్వాలు కల్పించుకుని ‘హ్యాష్ ట్యాగ్’తో కొట్టేసుకుంటుంటారు. వాళ్లు అభిమానించే హీరోలేమే బయట చాలా మంచి స్నేహితులై ఉంటారు. కానీ వాళ్లు మాత్రం ఆన్ లైన్లో జన్మజన్మల శత్రుత్వం ఉన్నట్లుగా గొడవలు పడుతుంటారు.
వ్యక్తిగతంగా మంచి మిత్రులై జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తుంటే.. వారి అభిమానులేమో అందులో ఎవరి క్రెడిట్ ఎంత అనే విషయంలో చాన్నాళ్లుగా గొడవలు పడుతున్నారు.
ఇంకా మహేష్ వెర్సస్ పవన్.. ఎన్టీఆర్ వెర్సస్ మహేష్.. ప్రభాస్ వెర్సస్ పవన్.. చరణ్ వెర్సస్ బన్నీ.. ఇలా సోషల్ మీడియాలో ఉంటున్న వాళ్లు ఎన్నో రకాల గొడవల్లో భాగస్వాములు అవుతున్నారు. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్ప అని.. అవతలి వాళ్లు వేస్ట్ అని.. తమవే రికార్డులని.. వాళ్లకు రికార్డులు లేవని.. ఇలా సామాజిక మాధ్యమాల్లో ఎన్నెన్ని గొడవలో.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునల ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. చిరు, నాగ్ వ్యక్తిగతంగా ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇద్దరి బాక్సాఫీస్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. చిరును మించిన హీరో లేడని, ఆయన ఇమేజ్‌ను ఎవరూ అందుకోజాలరని గతంలో నాగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
ఇప్పుడూ ఆ మాటకు కట్టుబడే ఉంటాడనడంలో సందేహం లేదు. నాగ్ విషయానికి వస్తే ఆయన స్థాయిలో ఆయనా పెద్ద హిట్లు ఇచ్చారు. ఎన్నో వినూత్నమైన ప్రయోగాలతో ప్రత్యేకత చాటుకున్నాడు. ఇలా ఎవరి గుర్తింపు వాళ్లకు ఉంది. కానీ వీళ్ల అభిమానుల మధ్య ఇప్పుడు ఎందుకు చిచ్చు మొదలైందో ఏమో కానీ.. పరస్పరం బురద చల్లుకుంటున్నారు.
చిరువి ఫేక్ రికార్డులని, నాగ్ గొప్ప అని ఆయన అభిమానులు.. చిరు ముందు నాగ్ చాలా చిన్న స్థాయి హీరో అని ఆయన ఫ్యాన్స్ అవతలి వాళ్లను కించపరిచేలా దారుణమైన ట్వీట్లు వేసి చిరు-నాగ్‌ల స్నేహాన్ని కించపరుస్తున్నారు. రెండు రోజులుగా ఈ యవ్వారం నడుస్తోంది ట్విట్టర్లో.
This post was last modified on May 27, 2020 2:50 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…