హృతిక్ రోషన్.. సిద్దార్థ్ ఆనంద్ కాంబినేషన్ అంటే ఇండియన్ యాక్షన్ ఫిలిం లవర్స్ చాలా ఎగ్జైట్ అయిపోతారు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం బ్యాంగ్ బ్యాంగ్ సూపర్ హిట్టయింది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి చేసిన వార్ మూవీ పెద్ద బ్లాక్‌బస్టరే అయింది.
యాక్షన్ సినిమాలను చాలా స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తాడని పేరున్న సిద్దార్థ్.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా పఠాన్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తవ్వగానే మళ్లీ అతను హృతిక్‌తోనే జట్టు కట్టబోతున్నాడు. ఆ చిత్రమే.. ఫైటర్. ఇప్పటిదాకా హృతిక్‌తో నేల మీదే యాక్షన్ విన్యాసాలు చేయించిన సిద్దార్థ్.. ఈసారి ఆకాశంలో అద్భుతాలు చేయించబోతున్నాడు. ఇది ఇండియాలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి ఏరియల్ యాక్షన్ మూవీ.
దీన్ని ఒక ఫ్రాంఛైజీగా తీయబోతున్నట్లు నిర్మాణ సంస్థ వయాకామ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా మొదలు కాకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఏడాదిన్నర తర్వాత 2023 జనవరి 26న గణతంత్ర దినోత్సవ కానుకగా ఫైటర్ విడుదల కానున్నట్లు వయాకామ్ సంస్థ ప్రకటించింది.
ఈ చిత్రంలో హృతిక్ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటించనుంది. హృతిక్-సిద్దార్థ్-దీపికా.. ఈ కాంబినేషనే ప్రేక్షకులను ఎంతో ఎగ్టైజ్ చేస్తోంది. చివరగా వార్ మూవీతోనే పలకరించిన హృతిక్.. ప్రస్తుతం సౌత్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేద రీమేక్‌లో నటిస్తున్నాడు.
ఇందులో అతను ఒరిజినల్లో విజయ్ సేతుపతి చేసిన రౌడీ పాత్రలో కనిపించనున్నాడు. మాధవన్ చేసిన పోలీస్ క్యారెక్టర్లో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. మాతృకను రూపొందించిన పుష్కర్-గాయత్రిలే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు.
This post was last modified on August 14, 2021 6:54 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…