తమ సినిమాలు విడుదలయ్యే ముందు అందరూ గొప్పలు చెప్పుకునేవాళ్లే. కొందరైతే మరీ మరీ శ్రుతి మించిపోయి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు. దాని వల్ల కొన్నిసార్లు మంచి జరుగుతుంది, కొన్నిసార్లు చెడు జరుగుతుంది.
ముందు నుంచి స్టేజ్‌ల మీద చాలా అగ్రెసివ్‌గా మాట్లాడ్డం అలవాటైన యువ కథానాయకుడు విశ్వక్సేన్.. తన కొత్త చిత్రం పాగల్ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఈ సినిమాతో మూసుకున్న థియేటర్లు కూడా తెరిపించేస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా అంటూ అతను ఇచ్చిన స్టేట్మెంట్ చర్చనీయాంశం అయింది.
ఇంకా సినిమా గురించి ఓ రేంజిలో చెప్పుకుంటూ పోయాడు విశ్వక్. ఐతే శనివారం థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ విశ్వక్ కామెంట్స్ చాలా అతిగానే అనిపించాయి. ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు, విశ్వక్ పెర్ఫామెన్స్ వరకు ఓకే కానీ.. అంతకుమించి సినిమాలో ఏమంత విషయం లేదు. సీరియస్‌గా కథలోకి దిగిన దగ్గర్నుంచి సినిమా గాడి తప్పింది. దీంతో విశ్వక్ చెప్పిందేంటి.. సినిమాలో ఉన్నదేంటి అంటూ నెటిజన్లు రివర్స్‌లో అతణ్ని ఆడుకోవడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం నుంచి విశ్వక్ బాగా ట్రోల్ అవుతున్నాడు.
ఐతే ఇలా ట్రోల్ అయితే అయ్యాడు కానీ.. ప్రి రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లతో అతడి లక్ష్యం మాత్రం నెరవేరింది. పాగల్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ అంచనాలకు మించి జరిగాయి. శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు ఫుల్స్ పడ్డాయి. చాలా చోట్ల మార్నింగ్ షోలకు టికెట్లు దొరకని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు డివైడ్ టాక్ వల్ల వీకెండ్ తర్వాత సినిమా పరిస్థితి కష్టమే కావచ్చు కానీ.. వారాంతం వరకు ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టి నిర్మాతలు, బయ్యర్లను బయటపడేసేలాగే కనిపిస్తోంది.
This post was last modified on August 14, 2021 6:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…