ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నయనతారది ఒక ప్రత్యేకమైన శైలి. స్టార్ ఇమేజ్ అందుకున్నాక ఆమె తనకంటూ ఒక రూల్ పెట్టుకుంది. సినిమాలో నటించడం వరకే తన పని. ప్రమోషన్ల సంగతి తనకు అనవసరం అని. సినిమాకు సంతకం చేసేముందే ఈ విషయాన్ని ఆమె స్పష్టం చేస్తుంది. ప్రమోషన్ మెలిక పెడితే సినిమా వదులుకోవడానికి కూడా వెనుకాడదు.
ఐతే నయన్ ఇలా అగ్రిమెంట్ చేసుకున్నా సరే.. సినిమాను ప్రమోట్ చేయడం కథానాయిక బాధ్యత కదా, ఇలా చేస్తే ఎలా అంటూ ఆమె మీద ఎప్పట్నుంచో విమర్శలు వస్తూనే ఉంటాయి. తనకు బాగా డిమాండ్ ఉన్నంత మాత్రాన ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటుంటారు. కానీ నయన్ మాత్రం ఈ విమర్శలను ఎప్పుడూ పట్టించుకున్నది లేదు. అప్పట్లో సినిమాలకు గుడ్‌బై చెప్పడానికి రెడీ అవుతూ చివరగా చేసిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రానికి మాత్రం ఆడియో వేడుకకు హాజరైంది నయన్.
స్టార్ ఇమేజ్ సంపాదించాక అది కాకుండా ఏ చిత్రాన్నీ ఆమె ప్రమోట్ చేసింది లేదు. తమిళంలో కూడా ఈ ఒరవడిని ఆమె కొనసాగించింది. ఐతే తాజాగా రిలీజైన తన కొత్త చిత్రం ‘నేత్రికన్’ను మాత్రం నయన్ ప్రమోట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఒక రేడియో ఇంటర్వ్యూ ఇచ్చింది నయన్.
‘నేత్రికన్’ చిత్రాన్ని నిర్మించింది నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ కావడం గమనార్హం. అంటే.. బాయ్ ఫ్రెండ్ సినిమాను మాత్రమే ప్రమోట్ చేసి, మిగతా చిత్రాల ప్రచారానికి దూరంగా ఉండటం ఏంటని నయన్‌ను ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలు విమర్శిస్తున్నారు. దీనికి నయన్ సమాధానం చెప్పింది. ఈ సినిమాను ప్రమోట్ చేస్తానని అగ్రిమెంట్లో పేర్కొన్నానని, కాబట్టే చేశానని.. మిగతా సినిమాలకు ఒప్పందం ప్రకారం కుదరదన్నాను కాబట్టి ప్రమోషన్ చేయలేదని.. ఇది తన ఛాయిస్ అంటూ లాజిక్ తీసి మాట్లాడుతోంది నయన్.
This post was last modified on August 14, 2021 10:22 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…