గతంలో పెళ్లయిందంటే చాలు.. హీరోయిన్ల కెరీర్‌లు చాలా వరకు అటకెక్కేసేవి. చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలన్న నిర్ణయం ముందే తీసుకుని ఏడడుగులు వేసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. పెళ్లి తర్వాత స్వేచ్ఛగా సినిమాల్లో నటిస్తున్నారు హీరోయిన్లు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, సమంత, శ్రియ.. ఈ జాబితాలో చాలామందే కనిపిస్తారు.
కాజల్ అగర్వాల్ సైతం పెళ్లి తర్వాత సినిమాలేమీ మానేయలేదు. ఇంకా మంచి ఊపులోనే సాగుతోంది. పెళ్లికి ముందు నటిస్తున్న ‘ఆచార్య’ను పూర్తి చేసింది. ‘ఇండియన్-2’ను కూడా పూర్తి చేయడానికి రెడీగా ఉంది. ‘ఉమ’ అనే హిందీ చిత్రంతో పాటు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. ఇలా ఆమె ఏ ఇబ్బంది లేకుండా సినిమాలు చేసుకుపోతోందంటే అందుకు భర్త గౌతమ్ కిచ్లు సహకారం ఎంతో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఐతే భర్త సహకారం గురించి చెబుతూనే.. గౌతమ్ సినిమాలు వద్దని ఒక్క మాట అంటే చాలు, వెంటనే మానేస్తానని కాజల్ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగడం, భర్త సహకారం గురించి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కాజల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
“నేను ఎంత కాలం సినీ రంగంలో కొనసాగుతానో తెలియదు. నా భర్త సినీ రంగం నుంచి తప్పుకోవాలని కోరిన మరు క్షణమే నటనకు గుడ్ బై చెప్పేస్తాను. నా భర్త మాటకు విలువ ఇచ్చేలా నడుచుకుంటాను” అని ఒక సంప్రదాయ భారతీయ అమ్మాయిలా సమాధానం చెప్పింది కాజల్. పెళ్లి తర్వాత ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే వ్యక్తగత జీవితానికి కూడా మంచి ప్రాధాన్యమే ఇస్తోంది చందమామ. ఏమాత్రం ఖాళీ దొరికినా గౌతమ్‌తో విహారానికి వెళ్తూ ఆ ఫొటోలను అభిమానులకు పంచుకుంటూ తానెంత హ్యాపీగా ఉందో చెప్పకనే చెబుతోంది.
This post was last modified on August 12, 2021 5:54 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…