Movie News

చోరుడు థియేటర్లలోకి దిగుతున్నాడు

యువ కథానాయకుల్లో శ్రీ విష్ణు స్టైలే వేరు. అతడి సినిమా అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలిగేలా విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తూ వస్తున్నాడతను. అప్పట్లో ఒకడుండేవాడు, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో ఎంతో ఆకట్టుకున్న విష్ణు నుంచి వస్తున్న మరో వైవిధ్యమైన సినిమా.. రాజ రాజ చోర. హాసిత్ గోలి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయిక. దర్శకుడు రవిబాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మధ్యే విడుదలైన దీని ప్రి టీజర్, టీజర్ ప్రేక్షకుల్లో కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తించాయి. సినిమా మీద అంచనాలను పెంచాయి. టీజర్ రిలీజ్ తర్వాత వార్తల్లో లేకుండా పోయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘రాజ రాజ చోర’ను ఈ నెల 19న థియేటర్లలోకి దించబోతున్నట్లు ప్రకటించారు.

కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత రెండు వారాల కిందటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు పున:ప్రారంభం కాగా.. నెమ్మదిగా కాస్త క్రేజున్న సినిమాలు ఒక్కొక్కటి థియేటర్లలోకి దిగుతున్నాయి. ఈ వారం విశ్వక్సేన్ సినిమా ‘పాగల్’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. దానికి యూత్‌లో క్రేజ్ బాగానే ఉంది. ఈ కోవలోనే యూత్‌ను ఆకర్షించిన విష్ణు సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

విష్ణు ఇందులో దొంగ పాత్రను పోషించడం విశేషం. ఎవరి కంటా పడకుండా వినూత్న పద్ధతుల్లో దొంగతనం చేసే అతడికి కళ్లెం వేయడానికి ఒక టఫ్ పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వీళ్లిద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సినిమా నడుస్తుంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తున్న ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు ఉంటే విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవడానికి ఆస్కారముంది. థియేటర్ల పరిస్థితి ఏమంత బాగా లేకపోయినా.. కొంచెం పెద్ద సినిమాలు సైతం ఓటీటీ బాట పడుతున్నా.. ధైర్యం చేసి ఇలా థియేటర్లలోనే తమ చిత్రాలను రిలీజ్ చేస్తున్న యువ కథానాయకులను అభినందించాల్సిందే.

This post was last modified on August 11, 2021 5:58 pm

Share

Recent Posts

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

49 minutes ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

56 minutes ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

1 hour ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

3 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

4 hours ago

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

5 hours ago