టాలీవుడ్లో కొత్త చిత్రాలను ఎలా రిలీజ్ చేయాలనే విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. గత ఏడాదిన్నర వ్యవధిలో కరోనా కారణంగా థియేటర్ల వ్యవస్థ ఎంతగా దెబ్బ తిందో అందరికీ తెలిసిందే. ఈ ఏడాదిన్నరలో మూణ్నాలుగు నెలలకు మించి థియేటర్లు నడవలేదు. కరోనా కారణంగా ఇండియాలో థియేటర్ ఇండస్ట్రీకి జరిగిన నష్టం మరే రంగానికీ జరగలేదంటే అతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ, తెలంగాణల్లోనూ పదుల సంఖ్యలో థియేటర్లను మూసేశారు. వాటిని నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భవిష్యత్ మీద ఆశతో ఎగ్జిబిటర్లు చాలా థియేటర్లను అతి కష్టం మీద మెయింటైన్ చేస్తూ వచ్చారు. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ థియేటర్లు తెరుచుకుని పేరున్న కొత్త చిత్రాలు రిలీజైతే ఇండస్ట్రీ పుంజుకుంటుందని చూస్తున్నారు.
కానీ నిర్మాతల కష్టం నిర్మాతలది. థియేటర్ల కోసం ఎక్కువ రోజులు ఎదురు చూడలేక, అందులో వస్తుందనుకున్న ఆదాయాన్ని మించి ఓటీటీలు ఆఫర్ చేస్తున్న రేట్లు టెంప్ట్ అయి తమ చిత్రాలను అమ్మేయడానికి చూస్తున్నారు. కానీ ఇలా పేరున్న సినిమాలన్నీ ఓటీటీల బాట పడితే థియేటర్లలో ఏ సినిమాలు ఆడించాలని ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల సమావేశం నిర్వహించి అక్టోబరు వరకు ఎవరూ ఓటీటీల వైపు వెళ్లొద్దని అల్టిమేటం విధించారు. కానీ దీన్ని మీరి అగ్ర నిర్మాత సురేష్ బాబు తన చిత్రం ‘నారప్ప’ను ఓటీటీలో రిలీజ్ చేసేశారు. ఇది ఎగ్జిబిటర్ల సంఘానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సురేష్ బాబు స్థాయి వ్యక్తిని ఏమీ అనలేక ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ లాంటి మరో పేరున్న సినిమా ఓటీటీ బాట పట్టింది.
తాము ఇలాగే ఊరుకుంటే మరిన్ని సినిమాలు ఓటీటీ బాట పడతాయన్న ఆందోళనతో ఈ చిత్ర నిర్మాతలను ఎగ్జిబిటర్ల సంఘం నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన లక్ష్మణ్‌ను మందలించినట్లు సమాచారం. ఓవైపు హీరో నాని థియేటర్లకు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడీ డీల్‌కు ఎలా అంగీకరించాడని అతణ్నీ ప్రశ్నిస్తున్నారట. ఈ గొడవ ఏదో తేలాకే ‘టక్ జగదీష్’ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ డీల్ పూర్తి చేసుకున్న ‘మ్యాస్ట్రో’ గుంభనంగా ఉందని, ఈ డిజిటల్ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడానికి ఇదీ ఒక కారణమే అని.. వివాదం కాస్త సద్దుమణిగాక హడావుడి లేకుండా వీలైనంత త్వరగా సినిమాను హాట్ స్టార్‌లో రిలీజ్ చేసేయాలని చూస్తున్నట్లు సమాచారం.
This post was last modified on August 11, 2021 10:27 am
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…