ట్విట్టర్ కొన్ని నెలల కిందటే అందుబాటులోకి తెచ్చిన కొత్త ఫీచర్.. స్పేస్. ఇందులో ఒక టాపిక్ ఎంచుకుని ఎంతమందైనా జాయిన్ అయి చర్చ పెట్టుకోవచ్చు. సినీ రంగంలో ఈ స్పేస్ బాగా పాపులర్. ఎక్కువగా సినిమా టాపిక్స్ మీదే నెటిజన్లు ట్విట్టర్‌లో స్పేస్‌లు పెడుతుంటారు. ఈ మధ్య ఫిలిం సెలబ్రెటీల పుట్టిన రోజుల సందర్భంగా తరచుగా స్పేస్‌లు పెడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద ఎత్తున వీటిలో పాల్గొంటున్నారు. ఆ మధ్య ఈవీవీ సత్యనారాణ పుట్టిన రోజుకు పెట్టిన స్పేస్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
సోమవారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కూడా ఒక పెద్ద స్పేసే పెట్టారు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ స్పేస్‌ను హోస్ట్ చేయగా.. శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, సందీప్ రెడ్డి వంగ, మెహర్ రమేష్, పరశురామ్ లాంటి చాలా మంది ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
ఈ స్పేస్ మధ్యలో మహేష్ బాబు సైతం జాయిన్ కావడం విశేషం. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ సైతం ట్విట్టర్లో హల్‌చల్ చేస్తోంది. టాలీవుడ్ అనే కాదు.. సౌత్ ఇండియాలో ఇలా ట్విట్టర్ స్పేస్‌లో పాల్గొన్న పెద్ద స్టార్ మహేష్ బాబే అయ్యుండొచ్చు. కాగా ఈ స్పేస్‌లో అనేకమంది ప్రముఖులు మహేష్ గురించి తమ అభిప్రాయాలను చాలా గొప్పగా చెప్పారు.
సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ఆల్రెడీ మహేష్ బాబుకు కథ చెప్పానని.. ఒక ఒరిజినల్ స్టోరీతోనే ఆ సినిమా ఉంటుందని.. సరైన సమయంలో ఆ సినిమా గురించి ప్రకటన వస్తుందని చెప్పాడు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. మహేష్‌తో ఒక ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ తీయాలన్నది తన కోరిక అని.. కచ్చితంగా సూపర్ స్టార్ కోసం స్క్రిప్టు తయారు చేసి ఆయన్ని కలుస్తానని అన్నాడు. మహేష్ సెన్సాఫ్ హ్యూమర్‌ను ఇంకా తెరపై సరిగా ఎవరూ వాడుకోలేదని అతనన్నాడు.
This post was last modified on August 10, 2021 7:23 am
సోమవారం వసంత పంచమి. చాలా మంచి రోజు. ఈ శుభ సందర్భాన్ని కొత్త సినిమాల ఓపెనింగ్ కోసం టాలీవుడ్ బాగానే…
విక్టరీ వెంకటేష్ మొట్టమొదటి వెబ్ సిరీస్ గా 2023 మార్చిలో విడుదలైన రానా నాయుడు భారీ స్థాయిలో మిలియన్ల కొద్దీ…
ఊరిపేరు భైరవకోనతో ట్రాక్ లో పడ్డ యూత్ హీరో సందీప్ కిషన్ ఈ నెలలో మజాకాతో పలకరించబోతున్నాడు. త్రినాధరావు నక్కిన…
లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ప్రధాన పాత్ర పోషించిన బ్రహ్మ ఆనందం ఫిబ్రవరి 14 విడుదల కానుంది. మాములుగా అయితే విశ్వక్…
బాలీవుడ్ లో బేబీ జాన్ తో అడుగు పెట్టిన కీర్తి సురేష్ కి తొలి సినిమానే డిజాస్టర్ కావడం నిరాశపరిచేదే…
అనుకున్నంతా అయ్యింది. అధికార పార్టీ టీడీపీ వ్యూహాల ముందు విపక్ష వైసీపీ వ్యూహాలు ఫలించలేదు. రాజకీయాలకు కొత్తే అయినా గుంటూరు…