ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తన రెండో కుమారుడు అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. తన నిర్మాణంలో తేజ దర్శకుడిగా సినిమాను సెట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. సురేష్ బాబు తన సినిమాల ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ తేజ మాత్రం కథకు అవసరమంటే కాంప్రమైజ్ అవ్వరు. దాంతో ఇద్దరి మధ్య అప్పుడే గ్యాప్ మొదలైందని సమాచారం.
ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో సురేష్ వెనుకంజ వేశారు. కృతి అయితే కోటి వరకు అడుగుతుందని.. వేరే హీరోయిన్ ను తీసుకోమని సురేష్ బాబు చెప్పడంతో తేజ రాజీ పడ్డారు. అయితే ఇప్పుడు మరో యాక్టర్ విషయంలో కూడా సురేష్ బాబు ఇలానే చేస్తున్నట్లు సమాచారం. కథలో కీలకపాత్ర కోసం సముద్రఖనితో సంప్రదింపులు జరిపారు తేజ. ఆయన కూడా ఈ సినిమాలో నటించడానికి రెడీగానే ఉన్నారు.
కానీ మళ్లీ రెమ్యునరేషన్ దగ్గర ఇష్యూ వచ్చినట్లు సమాచారం. సముద్రఖని అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సురేష్ బాబు సిద్ధంగా లేరట. దీంతో ఆయనకు బదులుగా మరొకరిని తీసుకోమని తేజకి చెప్పారట. కానీ ఈసారి మాత్రం తేజ కాంప్రమైజ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో కాస్త పట్టుదలగా ఉండి సురేష్ బాబుని ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు ఆ పాత్రకు సంబంధించిన సీన్లను చిత్రీకరించకుండా పక్కన పెడుతున్నారు. మరి తేజ రిక్వెస్ట్ ను సురేష్ బాబు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి!
This post was last modified on August 10, 2021 7:07 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…