డైరెక్టర్లు యాక్టర్లు కావడం కొత్తేమీ కాదు. తెలుగు, తమిళ భాషల్లో ఈ కోవలో చాలామందే కనిపిస్తారు. తమిళంలో వాలి, ఖుషి, న్యూ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీస్ తీసిన ఎస్.జె.సూర్య తన దర్శకత్వంలోనే కొన్ని సినిమాల్లో నటుడిగా మెప్పించాడు. ఆ తర్వాత అతను కోలీవుడ్లో బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. సైకో టచ్ ఉన్న విలన్ పాత్రల్లో అతను అదరగొట్టేస్తున్నాడు. ‘స్పైడర్’ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అందులోనూ ఎస్.జె.సూర్య నటన ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.
ఇప్పుడు మరో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. అదో టైపు సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సెల్వ.. ఈ మధ్య కాస్త జోరు తగ్గించాడు. ఎస్.జె.సూర్య హీరోగా తీసిన ‘నెంజం మరప్పదిల్లై’ ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత ధనుష్ హీరోగా ఓ సినిమాను లైన్లో పెట్టిన సెల్వ.. ఈ లోపు నటుడిగా పరిచయం అవుతున్నాడు.
కీర్తి సురేష్‌తో కలిసి ‘సాని కాయిదం’ అనే సినిమాతో సెల్వ నటుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో వీళ్లిద్దరూ సైకో కిల్లర్ల పాత్రలు పోషిస్తుండటం విశేషం. ‘దండుపాళ్యం’ తరహా వయొలెంట్ మూవీలా కనిపించింది ఫస్ట్ లుక్ చూస్తే. ఈ సినిమా చిత్రీకరణ జోరుగా సాగుతుండగానే సెల్వ నటుడిగా మరో అవకాశం అందుకున్నాడు. ఇది చాలా పెద్ద ఛాన్స్ కావడం గమనార్హం.
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ‘బీస్ట్’లో సెల్వ ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు. అతడి లుక్స్ ప్రకారం చూస్తే ఇది విలన్ పాత్ర అయ్యుండొచ్చని, ఇందులోనూ సైకో టచ్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చూస్తుంటే ఎస్.జె.సూర్య తరహాలోనే సెల్వ సైతం నటుడిగా బిజీ అయిపోయేలా ఉన్నాడు. ‘బీస్ట్’ మీద అంచనాలు మామూలుగా లేవు. నెలన్నర కిందట వచ్చిన ఫస్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు.
This post was last modified on August 8, 2021 8:48 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…