సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్లో ఒక రకమైన నిస్తేజం నెలకొంది. థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు లభించినా వెంటనే వెండితెరలు వెలుగులు సంతరించుకోలేదు. కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు కూడా అంత ఉత్సాహం చూపించలేదు. కరోనా మూడో వేవ్ భయాలు జనాల్లో కొనసాగుతుండటం, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల గొడవ ఎంతకీ తేలకపోవడం ఇందుకు కారణం కావచ్చు. థియేటర్లు తెరుచుకున్నాక గత పది రోజుల్లో చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తొలి వారం సినిమాలకు ఆశించినంత స్పందన కనిపించకపోవడంతో రెండో వారం ఊపు తగ్గింది. ఈ వారం చిత్రాల్లో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’కి ఓపెనింగ్స్ పర్వాలేదు. మిగతా సినిమాలను ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు.
ఈ టైంలో మంచి క్రేజున్న సినిమాలను తెస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ విడుదలకు సిద్ధంగా ఉన్న ‘లవ్ స్టోరి’ సినిమాను మేకర్స్ అట్టిపెట్టుకుని ఉన్నారు. ‘విరాటపర్వం’ సంగతి ఎటూ తేలట్లేదు. మ్యాస్ట్రో, టక్ జగదీష్ సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇలాంటి టైంలో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో విశ్వక్సేన్ తన కొత్త చిత్రం ‘పాగల్’ను వచ్చే శనివారం విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ కలిసి నిర్మించిన చిత్రమిది. నరేష్ కుప్పిలి అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా టీజర్ వచ్చి చాలా రోజులైంది. ఏప్రిల్ నెలాఖర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల వాయిదా వేశారు. ఐతే థియేటర్ల పున:ప్రారంభం తర్వాత ‘పాగల్’ రిలీజ్ గురించి ఏ డిస్కషన్ లేదు. ప్రమోషన్లు కూడా ఏమీ లేవు.
ఉన్నట్లుండి ఆగస్టు 14 అంటూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. గత రెండు వారాల్లో వచ్చిన తిమ్మరసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాల రిలీజ్ గురించి కొన్ని వారాల ముందే ప్రకటనలు వచ్చాయి. ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు. కానీ ‘పాగల్’ రిలీజ్ గురించి మాత్రం ఇప్పుడే చెబుతున్నారు. ఈ వారం రోజులు గట్టిగా ప్రమోట్ చేసి గ్రాండ్‌గా సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లున్నారు. ఈ టైంలో రావడం రిస్కే అయినప్పటికి చిత్ర బృందం ధైర్యం చేస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. దీని రిజల్ట్‌ను బట్టి మీడియం రేంజ్ సినిమాల రిలీజ్ ప్లానింగ్ ఉండొచ్చు.
This post was last modified on August 8, 2021 1:24 pm
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…