రితీశ్ దేశ్‌ముఖ్.. పెద్ద స్టార్ ఏమీ కాదు కానీ, బాలీవుడ్లో బాగానే పాపులర్. ముఖ్యమంత్రి కొడుకు హీరో అయితే పాపులర్ కాకుండా ఎలా ఉంటాడు? మహరాష్ట్రకు రెండు పర్యాయాలు సీఎంగా పని చేసిన విలాస్ రావ్ దేశ్ ముఖ్ కొడుకు అతను. ఆయన కేంద్ర కేబినెట్‌లోనూ పని చేశారు.
ముందు తండ్రి బ్యాకప్‌తోనే హీరోగా అవకాశాలు తెచ్చుకున్నప్పటికీ.. ఆ తర్వాత సొంత గుర్తింపు తెచ్చుకుని నటుడిగా కొనసాగుతున్నాడు రితీశ్. తండ్రి మీద అమితమైన ప్రేమాభిమానాలు ఉన్న రితీశ్.. మంగళవారం తండ్రి జయంతిని పురస్కరించుకుని ఒక ఎమోషనల్ వీడియోతో కన్నీళ్లు పెట్టించేశాడు. తన ఇంట్లో హ్యాగర్‌కు తగిలించిన ఉన్న తండ్రి ట్రేడ్ మార్క్ పొలిటికల్ సూట్ దగ్గరికెళ్లిన రితీశ్.. చొక్కాలోపలికి ఒక చేతిని పోనిచ్చాడు.
తండ్రి తనను హత్తుకుని భుజం మీద చెయ్యి వేసి నిమురుతున్న ఫీలింగ్ తీసుకొచ్చాడతను. బ్యాగ్రౌండ్లో ఒక హృద్యమైన పాట కూడా పెట్టించాడు. పక్కనే తండ్రి ఫొటోను చూపించి హ్యాపీ బర్త్ డే అంటూ విష్ చేశాడు. ఎంతో హృద్యంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విలాస్ అభిమానులందరికీ ఇది కన్నీళ్లు పెట్టిస్తోంది. తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టేలా ఉందీ వీడియో. 1999-2003, 2004-2008 మధ్య రెండు పర్యాయాలు విలాస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.
ఆ తర్వాత కొంత కాలానికి అనారోగ్యం బారిన పడ్డ ఆయన.. అవయవాలు దెబ్బతినడంతో 2012లో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రితీశ్ దేశ్ ముఖ్ భార్య జెనీలియా తెలుగు సినిమాల్లో పాపులర్ హీరోయిన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్’ (నువ్వే కావాలి రీమేక్) సందర్భంగా ప్రేమలో పడ్డారు. పదేళ్ల పాటు ప్రేమికులుగా కొనసాగి.. తర్వాత పెళ్లి చేసుకున్నారు.
This post was last modified on May 27, 2020 9:22 am
2008లో విడుదలైన చిత్రం ‘సిద్దూ ఫ్రమ్ సికాకుళం’ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది శ్రద్ధాదాస్. తొలి చిత్రంతోనే యూత్ లో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…