ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్ పై ఆయన భార్య షాలిని గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస వంటి కేసులు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది షాలిని.
తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శ్రీమతి తానియా సింగ్ ముందు కేసు నమోదు చేయబడింది. కోర్టు హానీ సింగ్ కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది.
పెళ్లి అయిన దగ్గర నుండి హనీ సింగ్ తనను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడని.. తాగేసి ఇంటికి వచ్చేవాడని.. చాలా సార్లు తనను కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. హనీ సింగ్ తల్లితండ్రులు, సోదరు కూడా తనను ఇబ్బందులకు గురి చేశారని షాలిని ఆరోపణలు చేసింది. హనీ సింగ్ కు ఇతర మహిళలతో కూడా అక్రమ సంబంధాలు ఉన్నట్లు షాలిని చెప్పుకొచ్చింది. నిజానికి హనీ సింగ్ కు షాలినితో 2011లోనే వివాహం జరిగింది.
కానీ అతడు మూడేళ్ల వరకు తనకు పెళ్లైన విషయాన్ని బయటపెట్టలేదు. 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో తన భార్యను జనాలకు పరిచయం చేశాడు హనీ సింగ్. ఆ సమయంలో అందరూ షాకయ్యారు. ఇక బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో హనీ సింగ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
‘కాక్‌టెయిల్’ సినిమాలో ఆంగ్రేజీ బీట్ సాంగ్ తో హనీ సింగ్ బాగా పాపులర్ అయ్యాడు. ఆ తరువాత నుండి అతడికి బాలీవుడ్ లో తిరుగులేకుండా పోయింది. మరి ఇప్పుడు షాలిని ఇచ్చిన ఫిర్యాదులు అతడి కెరీర్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తాయేమో చూడాలి!
This post was last modified on August 4, 2021 7:54 am
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఇప్పుడు నిజంగానే ఫుల్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. తన తాజా చిత్రం…
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్యాగ్ ని సంవత్సరాల తరబడి మోస్తున్న ప్రభాస్ పెళ్లి శుభవార్తని వినాలనే కొద్దీ ఆలస్యమవుతూనే…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజిలో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పండుగ పూట…
గత డిసెంబర్ లో సర్వం సిద్ధం చేసుకుని పూజా కార్యక్రమాలతో సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న టైంలో మోక్షజ్ఞ…
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…