కరోనా వైరస్ ప్రపంచానికి చేసిన నష్టం మాటేమో కానీ ఆర్.ఆర్.ఆర్. సినిమాకి మాత్రం పెద్ద దెబ్బ వేసింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం జరిగే పని కాదు. అయితే దానికంటే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు రాజమౌళికి ఆందోళన కలిగిస్తోందని చెప్పుకుంటున్నారు. కరోనా రాకముందు సినిమా మార్కెట్ కి అనుగుణంగా ఈ చిత్రానికి బడ్జెట్ వేసుకున్నారు.
కానీ ఒక రెండేళ్ల వరకు సినిమా వ్యాపారం పూర్వ స్థితికి రాదని భావిస్తున్న నేపథ్యంలో ఆర్.ఆర్.ఆర్. కి మునుపటి బడ్జెట్ వర్కవుట్ అవుతుందా? అప్పుడు మాట్లాడుకున్న అమౌంట్ ఇవ్వడానికి ఇప్పుడు బయ్యర్లు అంగీకరిస్తారా? ఇలా వేళా ప్రశ్నలు రాజమౌళిని వేధిస్తున్నాయి. ఈ చిత్రానికి నిర్మాత దానయ్య అయినా కానీ పెట్టుబడి వరకు మాత్రమే ఆయన పని. బిజినెస్ ఇతరత్రా అన్నీ జరిగేది రాజమౌళి టీం కనుసన్నలలోనే. సినిమా థియేటర్లకు మళ్ళీ జనం మాములుగా ఎప్పటికి వస్తారు, అసలు ఏ భయం లేకుండా ఫుల్ కెపాసిటీతో థియేటర్లు ఎప్పుడు రన్ చేసుకోవచ్చు అనేది తేలే వరకు ఎంతటివారికైనా ఈ గుబులు తప్పేట్టు లేదు.
This post was last modified on May 26, 2020 12:58 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్‌కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…