శ్రీదేవి కూతురి బ్యాడ్ లక్!

శ్రీదేవి కూతురి మొదటి సినిమా గురించి మీడియాలో జరిగిన ఆర్భాటం మరెవరి గురించి జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా జాన్వీ ఆగమనం గురించి ఊదరగొట్టారు. కరణ్ జోహార్ ఆమెని ఒక సాదా సీదా సినిమాతో పరిచయం చేసాడు. ఆ తర్వాత కూడా ఆమెతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలే మొదలు పెట్టాడు. ఆ సినిమాలు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వవని ఇప్పుడు అంటున్నారు.

చిన్న బడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు హిందీ నిర్మాతలు చూస్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేసి ఆ తలనొప్పులు పడేకంటే ఓటిటీ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. కూతురి కెరీర్ దూసుకుపోతుందని అనుకుంటే ఇలా చిన్న హీరోయిన్ స్థాయికి పరిమితం కావడం పట్ల బోనీ కపూర్ నిరాశగా ఉన్నారట. జాన్వీ సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేలా చూడాలని కరణ్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. తెలుగు సినిమాలతో మొదలు పెట్టినా ఆ క్రేజ్ మరోలా ఉండేదని కపూర్లు ఇప్పుడు ఫీలవుతున్నారట.