దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ నుంచి దోస్తీ పేరుతో తొలి పాటను ఆదివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అయిదుగురు మ్యుజీషియన్స్ ఈ పాటను వేర్వేరు భాషల్లో ఆలపించారు. ఈ పాటకు మిశ్రమ స్పందన వస్తోంది ప్రేక్షకుల నుంచి.
కీరవాణి.. అయిదుగురు మ్యుజీషియన్స్.. అలాగే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించిన విధానం మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. ఐతే ఈ పాటను చిత్రీకరించడంలో దర్శకుడు రాజమౌళి పాత్ర ఏమీ లేదట.
అసలీ మ్యూజిక్ వీడియో ఐడియానే ఆయనది కాదట. రాజమౌళి తనయుడు కార్తికేయనే దీనికి కర్త కర్మ క్రియ అట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళే వెల్లడించడం విశేషం. ట్విట్టర్ ద్వారా ఆయనీ విషయాన్ని బయటపెట్టాడు.
తాను ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉండగా.. దోస్తీ పాటకు సంబంధించి మ్యూజిక్ వీడియో చేద్దామన్న ఆలోచన చేసింది.. ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరించింది కార్తికేయ అని రాజమౌళి తెలిపాడు. సతీష్ కృష్ణన్ అనే డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌తో కలిసి కార్తికేయ ఈ పాటను ప్లాన్ చేసి షూట్ చేశాడని జక్కన్న వెల్లడించాడు.
ఈ పాటలో భాగమైన మ్యుజీషియన్లకు, లిరిసిస్టులకు రాజమౌళి కృతజ్ఞతలు చెప్పాడు. బేసిగ్గా దోస్తీ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారని.. దాన్ని వివిధ భాషలకు చెందిన లిరిసిస్టులు అడాప్ట్ చేసుకుని వారి వారి భాషల్లో అద్భుతమైన సాహిత్యం సమకూర్చారని రాజమౌళి కొనియాడాడు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ మేకింగ్ వీడియో విషయంలోనూ తన క్రెడిట్ ఏమీ లేదని.. రెండు నెలల పాటు కష్టపడి దాన్ని కార్తికేయనే తీర్చిదిద్దాడని తన కొడుక్కి అప్పుడు కూడా రాజమౌళి ఘనత కట్టబెట్టడం తెలిసిందే.
This post was last modified on August 2, 2021 10:48 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…