సోనూసూద్ కి అరుదైన గౌరవం..!

కరోనా మహమ్మారి మన దేశాన్ని ఎలా పట్టిపీడించిందో అందరికీ తెలిసిందే. ఆ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించగా.. ఆ సమయంలో వలస కార్మికులు స్వస్థలాలకు చేర్చేందుకు నడుం బిగించాడు.. సినీ నటుడు సోనూసూద్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకు తోచిన సేవలు చేస్తూనే ఉన్నాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలిచేందుకు ఆయ‌న ఎన్నో ర‌కాలుగా సాయం అందిస్తున్నారు.

అడిగింది లేద‌న‌కుండా ఆదుకుంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న నేష‌న‌ల్ రియల్ హీరోగా మారిపోయారు. ఇది ఇలా ఉండగా కరోనా మహమ్మారి సమయంలో ఎంతో మంది ఆపన్నులకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్న స్టార్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.

వచ్చే ఏడాది జరగబోయే స్పెషల్ ఒలంపిక్స్…. వరల్డ్ వింటర్ గేమ్స్ రియల్ హీరో సోను సోను భారత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అయితే దీనిపై స్పందించిన సోనూసూద్… తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ గౌరవం తనకెంతో ప్రత్యేకమని.. స్పెషల్ ఒలంపిక్స్ భారత జట్టు తరఫున నిలబడటం తనకు ఆనందంగా మరియు గర్వంగా ఉందని సోనుసూద్ వెల్లడించారు.