దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తొలి పాట వచ్చేసింది. దోస్తీ పేరుతో ఆదివారం ఈ పాటను రిలీజ్ చేశారు. కొన్ని రోజుల నుంచి ఈ పాట గురించి చిత్ర బృందం ఓ రేంజిలో ఎలివేషన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పాట గురించి పెద్ద చర్చే నడుస్తోంది.
ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు.. ముగ్గురు పేరున్న గాయకులు.. ఒక్కో భాషలో ఒక్కొక్కరు ఈ పాటను పాడటం.. సంగీత దర్శకుడు కీరవాణితో వాళ్లందరూ కలిసి ఉన్న ఫొటోతో ఈ పాట గురించి అప్‌డేట్ ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి. పైగా రాజమౌళి సైతం ఈ సాంగ్‌కు ఎలివేషన్ ఇచ్చారు.
దీంతో భారీ అంచనాలతో ఈ పాట కోసం ఎదురు చూశారు ఫ్యాన్స్. పాట విని, విజువల్స్ చూశాక కాస్త నిరాశ కనిపిస్తోంది జనాల్లో. కీరవాణి అండ్ కో నుంచి ఇంకా ఎక్కువే ఆశించామన్నది మెజారిటీ అభిమానుల అభిప్రాయం.
ఐతే తెలుగు వెర్షన్ సాంగ్‌కు సీతారామశాస్త్రి సమకూర్చిన సాహిత్యం మాత్రం అద్భుతంగా ఉంది. కదిలే కార్చిచ్చుకి.. కసిరే బడగళ్లకి.. రవికి మేఘానికీ దోస్తీ లాంటి వాక్యాలు గూస్ బంప్స్ ఇచ్చేవే. తెలుగు వెర్షన్‌ను ప్రముఖ గాయకుడు హేమచంద్ర పాడాడు. అతడి గానం బాగానే సాగింది. హిందీలో అమిత్ త్రివేది.. మలయాళంలో విజయ్ ఏసుదాస్.. కన్నడలో యాజిన్ నజీర్.. తమిళంలో అనిరుధ్ రవిచందర్ తమ గాత్రాలను అందించారు.
ఐతే మిగతా వెర్షన్లతో పోలిస్తే తమిళ పాట కొంచెం భిన్నంగా, మెరుగ్గా అనిపిస్తుండటం విశేషం. మిగతా వాళ్లతో పోలిస్తే అనిరుధ్ ఎక్కువ ఫీల్‌తో, టిపికల్ వాయిస్‌తో ఈ పాట పాడాడన్న ఫీలింగ్ కలుగుతోంది. మిగతా వెర్షన్లతో పోలిస్తే అనిరుధ్ పాట ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అనిరుధ్ మేటి సంగీత దర్శకుడే కాదు.. మంచి సింగర్ కూడా. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోశాడు. యూత్, మాస్ పల్స్ బాగా తెలిసిన అతను.. ‘ఆర్ఆర్ఆర్’ పాటకు పూర్తి న్యాయం చేశాడనే చెప్పాలి. మిగతా గాయకులతో పోలిస్తే అతడికే ఎక్కువ మార్కులు పడుతున్నాయి.
This post was last modified on August 1, 2021 6:12 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్ మెంట్…
మిరపకాయ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్న మిస్టర్ బచ్చన్ గత ఏడాది తీవ్రంగా నిరాశ పరచడం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం…
ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అట్లీ దర్శకత్వంలో అతను చేయబోయే మెగా మూవీకి సంబంధించిన…
సింగపూర్ లో సోమవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదం భారీదేనని చెప్పాలి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ లో చదువుతున్న తన కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్…