కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని భాషల సినీ పరిశ్రమలూ దెబ్బ తిన్నాయి. అన్నింట్లోకి బాలీవుడ్‌కు తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. వేరే భాషల్లో కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌కు మధ్య సినిమాలు పెద్ద ఎత్తునే రిలీజయ్యాయి. వసూళ్లూ రాబట్టుకున్నాయి. కానీ బాలీవుడ్ మాత్రం అందుకు మినహాయింపు. మధ్యలో దొరికిన ఖాళీలో కొన్ని చిన్న సినిమాలు నామమాత్రంగా రిలీజయ్యాయి. వాటికీ సరైన వసూళ్లు లేవు.
సెకండ్ వేవ్ తర్వాత బాలీవుడ్ రీస్టార్ట్‌కు రంగం సిద్ధం చేశారు కానీ.. థియేటర్లు తెరిచిన కొంత కాలానికి మళ్లీ మూత వేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ థియేటర్లను పున:ప్రారంభిస్తున్నారు. సెకండ్ వేవ్ తర్వాత హడావుడిగా అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ను రిలీజ్ చేయాలనుకున్నారు. జులై నెలాఖర్లో విడుదలకు డేట్ కూడా ప్రకటించారు. కానీ వాయిదా వేసుకోక తప్పలేదు.
నిజానికి కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత యూరప్‌కు వెళ్లి సినిమాను పూర్తి చేసుకుని వచ్చిన ఈ చిత్రాన్ని ఏప్రిల్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. డేట్ కూడా ఇచ్చారు. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. సెకండ్ వేవ్ అయ్యాక కొత్త డేట్ ఇస్తే దాన్నీ అందుకోలేకపోయారు. ఇప్పుడు ఆగస్టు 19న రిలీజ్ అంటూ కొత్త డేట్ ఇచ్చారిప్పుడు.
స్వయంగా హీరో అక్షయ్ కుమారే డేట్ ప్రకటించాడు. కానీ మహారాష్ట్రలో థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. ఉత్తరాదిన కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆక్యుపెన్సీ విషయంలోనూ షరతులున్నాయి. మరోవైపు మూడో వేవ్ హెచ్చరికలు గట్టిగానే ఉన్నాయి. కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో 19న అయినా ఈ చిత్రం వస్తుందన్న గ్యారెంటీ లేదు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. కొత్త దర్శకుడు రంజిత్ తివారి రూపొందించిన ఈ చిత్రాన్ని వశు భగ్నాని నిర్మించాడు. ఈ సినిమాలో వాణి కపూర్, హ్యూమా ఖురేషి లారా దత్తా కీలక పాత్రలు పోషించారు.
This post was last modified on August 1, 2021 6:08 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…