నభా నటేష్ ఇప్పటిదాకా మీడియం రేంజ్ హీరోయిన్‌గానే ఉంది. తెలుగులో ఆమెకు అవకాశాలకైతే లోటు లేదు కానీ.. కెరీర్ మరో స్థాయికి వెళ్లే ఛాన్స్ కోసం చూస్తోంది ఈ కన్నడ భామ. అలాంటి ఛాన్సే ఇప్పుడు నభా తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఆమె బాలీవుడ్లోకి గ్రాండ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏకంగా సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సరసన నభా నటించబోతోందట. ఐతే ఇది సినిమా మాత్రం కాదు.. వెబ్ సిరీస్ అట.
దక్షిణాది హీరోలతో పోలిస్తే బాలీవుడ్ స్టార్లు వెబ్ సిరీస్‌ల పట్ల బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని తక్కువగా చూడకుండా.. భవిష్యత్ వాటిదే అని అర్థం చేసుకుని ఒక్కొక్కరుగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ‘సేక్ర్డ్ గేమ్స్’లో నటించగా.. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో ఇటీవలే ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ మొదలైంది. ఇప్పుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది.
హాలీవుడ్ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’ ఆధారంగా ఓ ప్రముఖ ఓటీటీ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇందులో లీడ్ హీరోయిన్‌గా నభా నటించనుందట. సినిమానా వెబ్ సిరీసా అన్నది పక్కన పెడితే.. బాలీవుడ్లోకి హృతిక్ రోషన్ లాంటి పెద్ద హీరోకు జోడీగా ఎంట్రీ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. నభా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఛాన్స్ అనడంలో సందేహం లేదు. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నభాకు ఆ సినిమా మంచి పేరే తెచ్చింది.
ఐతే ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆమెలోని గ్లామర్ యాంగిల్ హైలైట్ అయి.. వరుసగా అవకాశాలు అందుకుంది. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె కథానాయికగా నటించిన ‘మాస్ట్రో’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఆమెకు కొత్త ఛాన్సులైతే లేవు. సొంత భాష కన్నడలో మాత్రం ఓ సినిమా చేస్తోంది. బాలీవుడ్లో మంచి ఆరంభం లభిస్తే అక్కడ మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఈ హాట్ హీరోయిన్ ఆశిస్తోంది.
This post was last modified on July 31, 2021 5:03 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…