ఎవరా హీరోయిన్.. ఆమె పోరాటం చేస్తున్నది ఏ నిర్మాణ సంస్థ మీద అన్న ఆసక్తి కలుగుతోందా? ఐతే ఇది మన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదులెండి. హాలీవుడ్లో తలెత్తిన ఇష్యూ. ఫేమస్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ డిస్నీ మీద న్యాయపోరాటానికి సిద్ధమైంది. ఆ సంస్థకు వ్యతిరేకంగా లా సూట్ వేసింది. డిస్నీ నిర్మాణంలో తాను ప్రధాన పాత్ర పోషించిన ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఒకేసారి డిజిటల్లో రిలీజ్ చేస్తుండటమే ఇందుకు కారణం.
తనకు, ఆ సంస్థకు జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఈ చిత్రం థియేటర్లలోనే రిలీజ్ కావాలని.. తద్వారా వచ్చే ఆదాయంలో తనకు వాటా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని.. కానీ ఆ అగ్రిమెంట్‌ను బ్రేక్ చేస్తూ డిస్నీ సంస్థ ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని ఒకేసారి థియేటర్లతో పాటు డిజిటల్ రిలీజ్‌కు సిద్ధం చేస్తోందని స్కార్లెట్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఒక చిత్రాన్ని థియేటర్లతో పాటు డిజిటల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే.. థియేట్రికల్ రన్ ద్వారా వచ్చే ఆదాయం ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఆ మేరకు స్కార్లెట్‌కు థియేటర్ రెవెన్యూ ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. అందుకే ఆమె డిస్నీ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. హాలీవుడ్లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉండి, ప్రపంచవ్యాప్తంగా భారీగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో స్కార్లెట్ ఒకరు. అందుకే ఆమె హీరోల మాదిరే సినిమా రెవెన్యూలో వాటా తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటోంది.
‘బ్లాక్ విడో’ విషయంలో డిస్నీ వాళ్లతో ఇలాగే ఒప్పందం కుదిరింది. ఐతే కరోనా నేపథ్యంలో డిస్నీ సంస్థ ప్రణాళికలన్నీ మారిపోయాయి. కేవలం థియేట్రికల్ రన్ మీద ఆధారపడే పరిస్థితి లేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ చిత్రాలను వీలును బట్టి థియేటర్లలో, అలాగే ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తోంది. ‘బ్లాక్ విడో’ను కూడా అదే తరహాలో రిలీజ్‌కు రెడీ చేసింది. కానీ ఇప్పుడు స్కార్లెట్ లా సూట్ వేయడం డిస్నీకి షాకే. మరి ఆ సంస్థ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on July 30, 2021 10:31 am
మల్లువుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ మనకూ సూపరిచితుడే. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేయనప్పటికీ డబ్బింగ్ ద్వారా రెగ్యులర్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. మాట తీరు ఆచితూచి ఉన్నా..…
ఏపీలో తాజాగా జపాన్లో టాయామా ప్రిఫెడ్జర్ ప్రావిన్స్ గవర్నర్ సహా 14 మంది ప్రత్యేక అధికారులు.. అక్కడి అధికార పార్టీ…
రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా…
సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ .. సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు.…
మెగాభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదలకు ఇంకో 15 రోజులు మాత్రమే టైముంది. ప్రమోషన్లు రెగ్యులర్…