టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత అక్కినేని త్వరలోనే ప్రభాస్ సినిమాలో నటించబోతుందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘ప్రాజెక్ట్ కె’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం సమంతను సంప్రదించినట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. సమంత సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. అసలు ప్రభాస్ సినిమా ఆఫర్ రాలేదని తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి సంబంధించి ఆమెని ఎవరూ సంప్రదించలేరట. ప్రస్తుతం ఆమె ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసే పనిలో పడింది. ఈ పౌరాణిక గాథ పూర్తయితే గానీ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించే స్థితిలో లేదని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తన సినిమా కోసం ఇతర భాషల నుండి నటీనటులను దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ యాక్టర్ ను తీసుకున్నారు. అలానే మరికొంతమంది పేరున్న ఆర్టిస్ట్ లు రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను నిర్మించనున్నారు. అశ్వనీదత్ నిర్మించనున్న ఈ సినిమా 2023లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
This post was last modified on July 29, 2021 11:24 am
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…
బీజేపీ మాతృ సంస్థ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్).. తాజాగా కమల నాథులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు…
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…