ఆ సినిమా దెబ్బకి చనిపోదామనుకున్న డైరెక్టర్!

ఏ ఇండస్ట్రీలోనైనా సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి కామన్. అయితే సినిమా ఇండస్ట్రీ మాత్రం సక్సెస్ చుట్టూనే తిరుగుతుంటుంది. స్టార్ డైరెక్టర్ అయినా.. ఒక్క ప్లాప్ పడిందంటే నెక్స్ట్ ఛాన్స్ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిందే. కొందరు విజయం కోసం ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ఓటమికి కుంగిపోయి అక్కడే ఆగిపోతారు. దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చిందట.

2009లో ఓం ప్రకాష్ రూపొందించిన ‘ఢిల్లీ 6’ అనే సినిమా విడుదలైంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయింది. ఈ సినిమా రిజల్ట్ తో దర్శకుడు ఓం ప్రకాష్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట. ఈ విషయాలను తన ఆటోబయోగ్రఫీ ‘ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్’ (The Stranger in the Mirror) అనే పుస్తకంలో ప్రస్తావించాడు. ‘ఢిల్లీ 6’ సినిమా ప్లాప్ అవడంతో ఎంతో బాధపడ్డానని పేర్కొన్నాడు.

సినిమా థియేటర్లో ప్రదర్శించినప్పుడు జనాలు మధ్యలోనే లేచి వెళ్లిపోయేవారని.. కొన్నిరోజుల తరువాత తనను చంపుతామని బెదిరింపులు కూడా వచ్చినట్లు ఓం ప్రకాష్ తెలిపాడు. దీంతో డార్క్ ప్లేస్ లోకి వెళ్లిపోయానని.. బాధను తట్టుకోలేక మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. చచ్చేవరకు తాగి శాశ్వత నిద్రలోకి జారుకోవాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. తన ప్రవర్తన కారణంగా భార్య భారతి, కూతురు భైరవిలను ఇబ్బంది పెట్టానని.. తన కొడుకుతో దూరం పెరిగిందని తన బాధలను గుర్తుచేసుకున్నాడు. చివరకు తన భార్య సహకారంతోనే మామూలు మనిషి అయినట్లు చెప్పుకొచ్చాడు.

ఆ తరువాత ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన ‘రంగ్ దే బసంతి’, ‘భాగ్ మిల్కా భాగ్’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రీసెంట్ గా ఫర్హాన్ అక్తర్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘తుఫాన్’ సినిమా ఓటీటీలో విడుదలైంది.