కేవలం ఒక అర నిమిషం నిడివి ఉన్న వీడియోతో దేశాన్ని ఊపేసింది మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్. కొన్నేళ్ల కిందట ఈ అమ్మాయి ఓ చిన్న సినిమాలో భాగంగా కన్ను కొట్టే వీడియోతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఆ వీడియో అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయిపోయింది. విదేశీయులు సైతం ఆ అమ్మాయిని గుర్తుపట్టే పరిస్థితి వచ్చిందంటే అదంతా ఆ వీడియో పుణ్యమే. ఈ పాపులారిటీతో వివిధ భాషల్లో సినిమా అవకాశాలు కూడా అందుకుంది ప్రియా.
హిందీలో రెండు సినిమాలు చేస్తూ.. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అందులో ఒకటి ‘చెక్’ ఈ ఏడాది ఆరంభంలో విడుదలైంది. ఇప్పుడు ‘ఇష్క్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘ఇష్క్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఆమెకు జోడీగా తేజ సజ్జా నటించాడు. ఈ నెల 30న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ మీడియాతో మాట్లాడింది ప్రియ. వింక్ వీడియోతో వచ్చిన పాపులారిటీ సినిమా అవకాశాలు దక్కించుకున్నప్పటికీ వెంటనే సినిమాలు చేయలేదేంటి.. సొంత భాషలో అనుకున్నంత అవకాశాలు దక్కించుకోలేకపోయారేంటి అని అడిగితే.. అందుక్కారణం తన చదువే అని చెప్పింది ప్రియ. కనీసం డిగ్రీ చేశాకే సినిమాల్లో బిజీ కావాలనుకున్నానని.. చదువు మధ్యలో వదిలేసి సినిమాల్లో నటించాలనుకోలేదని ప్రియ చెప్పింది.
మలయాళంలో తనకు కొన్ని పెద్ద సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయని.. కానీ చదువు కోసమే వాటిని వదులుకోవాల్సి వచ్చిందని ప్రియ చెప్పింది. ఐతే తెలుగులో ఇప్పుడు తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని.. సొంత భాషలో కంటే కూడా తెలుగులో తనకు ఎక్కువ పాపులారిటీ కనిపిస్తోందని ప్రియ అంది. ‘ఇష్క్’ సినిమా షూటింగ్ మొదలు కావడానికి కేవలం రెండు రోజుల ముందు తనకు కాల్ వచ్చిందని.. ఒరిజినల్ చూడగానే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశానని.. వెంటనే సెట్లో వాలిపోయానని చెప్పింది ప్రియ.
This post was last modified on July 28, 2021 2:27 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…