టాలీవుడ్ అంతా వారసులతో నిండిపోయి ఉందిప్పుడు. టాలీవుడ్ యువ కథానాయకుల్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్లలో చాలామంది వారసులే. ఆ జాబితాలోకి తన కొడుకు కూడా చేరతాడని ఆశించారు సీనియర్ నటుడు సాయికుమార్. కానీ ఆయన ఆశ ఫలించలేదు.
సాయికుమార్ తనయుడు ఆది.. హీరోగా అరంగేట్రం చేసి పదేళ్లు కావస్తోంది. ఇంకా అతను నిలదొక్కుకోలేదు. ఆరంభంలో ఓ మోస్తరు విజయాలు దక్కాయి. వాటిని మించిన హిట్లు కోసం చూస్తే అసలుకే మోసం వచ్చింది. మొదట్లో చేసిన ప్రేమకావాలి, లవ్లీ లాంటి సినిమాలే నయమన్నట్లు తయారైంది పరిస్థితి. గత ఐదారేళ్లలో వరుసబెట్టి డిజాస్టర్లు ఇచ్చాడు ఆది. దీంతో అతడి మార్కెట్ జీరో అయిపోయింది.
ఐతే సాయికుమార్‌కు ఉన్న పరిచయాలు, పలుకుబడి వల్లో.. మంచి పేరు వల్లో ఆదికి ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అతను హీరోగా శశి పేరుతో ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆది కథానాయకుడిగా బ్లాక్ పేరుతో కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆది పోలీస్ పాత్ర చేస్తున్నాడు.
ఆది తండ్రి సాయికుమార్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా పోలీస్ స్టోరీ. ఆ తర్వాత వరుసగా పోలీస్ కథలే చేశాడు. ఆ పాత్రలతోనే మంచి స్థాయిని అందుకున్నాడు. ఆది ఇన్నేళ్ల తర్వాత తండ్రి రూట్లోకి వచ్చి పోలీస్ పాత్ర చేస్తున్నాడు. బ్లాక్‌లో అతను యారొగెంట్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మరి తండ్రి బాటలోకి వచ్చాక అయినా అతడికి హిట్టొచ్చి కెరీర్ బాగుపడుతుందేమో చూడాలి.
This post was last modified on May 24, 2020 9:48 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…
అధికారంలోకి రాకముందు.. ప్రజల మధ్య ఉండే పార్టీల గురించి తెలుసు. కానీ, అధికారం వచ్చిన తర్వాత కూడా నిరంతరం ప్రజలను…
"రూపాయి విలువ పడిపోయింది" అనే వార్త చూడగానే.. "మనకేంటిలే, మనం ఇండియాలోనే ఉన్నాం కదా" అని లైట్ తీసుకుంటే పొరపాటే.…