మొన్న బన్నీ.. ఇప్పుడేమో మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు చిత్రబృందం కొత్త షెడ్యూల్ ని కాకినాడలో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తుంది. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లో తీయాలని అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్ట్ లో షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. తెలుగు ఫిలిం మేకర్స్ కు అదొక ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది.

అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కొన్ని సన్నివేశాలను కాకినాడ పోర్ట్ లోనే చిత్రీకరించారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ‘ఆచార్య’ టీమ్ కూడా అక్కడే షూటింగ్ నిర్వహించనుంది. వచ్చే నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రామ్ చరణ్.. సిద్ధ అనే పాత్రలో కనిపించనున్నారు.

కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి వెంటనే ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. తమన్ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు.