కొత్త సినిమా రిలీజయ్యాక ఆ రోజు రాత్రికే పైరసీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేయడం మామూలే. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నదే. పైరసీని అడ్డుకోవడానికి పరిశ్రమ జనాలు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఈ జాఢ్యం ఆగట్లేదు. ఐతే కొన్నిసార్లు కొత్త సినిమాలు రిలీజ్ కాకముందే లీక్ అయిపోవడం, ఆన్‌లైన్లో సినిమా సినిమా మొత్తం ప్రత్యక్షం అయిపోయే దారుణ ఉదంతాలు కూడా జరుగుతుంటాయి. అప్పట్లో అత్తారింటికి దారేది సినిమా ఇలాగే నెట్లో ప్రత్యక్షం అయిపోవడం ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. మరికొన్ని చిత్రాలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి.
ఇప్పుడు ఓ కొత్త సినిమా విడుదలకు నాలుగు రోజుల ముందు ఆన్ లైన్లో లీక్ అయిపోయింది. ఆ చిత్రమే.. మిమి. 1 నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రమిది. ఈ నెల 30న నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కావాల్సి ఉంది.
ఐతే ఈ లోపు మిమి హెచ్‌డీ వెర్షన్ ఆన్ లైన్లోకి వచ్చేసింది. ఇంటర్నెట్లోకి ఓ సినిమా వచ్చిందంటే.. దానికి అడ్డు కట్ట వేయడం అంత సులువు కాదు. మొబైళ్లలో వైరల్ అయిపోతుంది. మిమి పరిస్థితి కూడా అంతే. పైరసీ వెర్షన్‌ను తీయించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నప్పటికీ దాన్ని ఇప్పటికే చాలామంది షేర్ చేసేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిత్ర నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ వాళ్లు వెంటనే స్పందించి.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30న కాకుండా సోమవారం సాయంత్రమే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసేశారు. విడుదలకు నాలుగు రోజుల ముందే సినిమా ఇలా లీక్ అయిందంటే అది కచ్చితంగా చిత్ర బృందంలోని వారి పనే అయ్యుంటుంది. నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ అంటే ఇప్పటికే సినిమాకు సంబంధించి కంటెంట్ అంతా వాళ్లకే ఇచ్చేసి ఉంటారు.
ఐతే చిత్ర బృందంలో ఎవరిదగ్గరైనా పస్ట్ కాపీ వెర్షన్ ఉండి ఏవైనా కారణాలతో ఇలా లీక్ చేశారేమో తెలియదు. చిత్ర బృందం దీనిపై విచారిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే పోలీసులను కూడా ఆశ్రయించినట్లు సమాచారం. డబ్బుకు ఆశపడి ఒక ఫారిన్ జంట కోసం సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి చూసే మధ్యతరగతి అమ్మాయి కథ ఇది.
This post was last modified on July 27, 2021 7:51 am
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…