రితికా సింగ్.. ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని గుర్తింపు సంపాదించిన అమ్మాయి. తమిళంలో ‘ఇరుదు సుట్రు’గా తెరకెక్కి హిందీలోనూ అనువాదమై సూపర్ హిట్ అయిన చిత్రంలో రితిక ఇండియాలో ఏ హీరోయిన్ చేయని సాహసాలు చేసింది. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ నుంచి రావడంతో తెర మీద కూడా నిజమైన బాక్సింగ్ విన్యాసాలు చేసింది. ఆ చిత్రం తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ అయి ఇక్కడా సక్సెస్ అయింది.
ఐతే ఫస్ట్ ఇంప్రెషన్ బలంగా వేసినా.. రితిక కోరుకున్న స్థాయిలో కెరీర్ పుంజుకోలేదు. లారెన్స్ సరసన ‘శివలింగ’ సినిమా చేసిన రితికా.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లతో పోలిస్తే రితిక లుక్స్ డిఫరెంటుగా ఉంటాయి. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కే ఆమె సూటయ్యేలా కనిపించడంతో ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.
ఈ మధ్య కాలంలో రితిక పేరే ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అమ్మడు బాగా నిరాశ చెందినట్లుంది. కెరీర్ ఆరంభంలో రితిక ఏ ఫొటో షూట్ చేసినా ట్రెడిషనల్‌గానే కనిపించేది. కానీ చాలామంది హీరోయిన్లలాగే ఆమె కూడా ఇప్పుడు రూటు మార్చింది. తనలోనూ గ్లామర్ యాంగిల్ ఉందని.. అవసరమైతే ఎంత సెక్సీగా అయినా కనిపించడానికి రెడీ అని చెప్పకనే చెబుతోంది.
తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్లో క్లీవేజ్ షో ఓ రేంజిలో చేసింది. రితికను ఇలా చూసి చాలా మంది షాకవుతున్నారు. ఈ అమ్మాయిని కూడా చెడగొట్టేశారా అంటూ తన ట్రెడిషనల్ లుక్స్‌ను ఇష్టపడే అభిమానులు ఫీలవుతున్నారు. మిగతా వాళ్లయితే ఈ అమ్మాయిలోని కొత్త యాంగిల్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ హాట్ ఫొటో షూట్లు చూశాకైనా రితికకు ఎవరైనా బోల్డ్ క్యారెక్టర్లు ఆఫర్ చేస్తారేమో చూడాలి.
This post was last modified on May 24, 2020 6:25 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…