పా.రంజిత్.. తమిళంలో మంచి పేరున్న దర్శకుడు. కబాలి, కాలా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను బాగానే పరిచయం. కొందరు దర్శకులకు ఐడియాలజీ ఉంటుంది కానీ.. దాన్ని ఏదో ఒక సినిమాలో బలంగా చూపించి, మిగతా సినిమాలకు మామూలు రూట్లో వెళ్లిపోతుంటారు. లేదంటే ఒకట్రెండు సన్నివేశాల్లో తమ భావజాలాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ పూర్తిగా ప్రతి సినిమాలోనూ తమ ఐడియాలజీని బలంగా చాటే ప్రయత్నం చేసిన దర్శకులు దాదాపుగా కనిపించరు. కానీ రంజిత్ ఆ కోవకే చెందుతాడు. అతను దళితుడన్న సంగతి కోలీవుడ్లో అందరికీ తెలుసు.
తన సినిమాల ద్వారానే కాక బయట కూడా దళిత భావజాలాన్ని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు రంజిత్. తమిళనాడు అనే కాదు.. దేశంలో ఎక్కడ దళితులపై అకృత్యాలు జరిగినా అతను స్పందిస్తాడు. ఎంతటి వారి మీద అయినా విమర్శలు చేస్తాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అతడి ప్రతి కథ కూడా దళితులపై వివక్ష, వారిని మిగతా సమాజం చూసే తీరు, వారిపై జరిగే అఘాయిత్యాలు, వారి పోరాటం నేపథ్యంలోనే ఉంటుంది. తొలి సినిమా ‘అట్టకత్తి’, ఆ తర్వాత చేసిన ‘మద్రాస్’ పూర్తిగా దళిత కాలనీల నేపథ్యంలోనే సాగుతాయి.
ఈ రెండు చిత్రాలతో మంచి పేరు సంపాదించి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు రంజిత్. ఇలా ఓ యువ దర్శకుడికి రజినీతో సినిమా చేసే అవకాశం వస్తే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి బ్లాక్‌బస్టర్ కొట్టాలని చూస్తాడు. కానీ రంజిత్ మాత్రం తన ఐడియాలజీని బలంగా చెప్పడానికి రజినీ ఇమేజ్‌ను వాడుకున్నాడు. కబాలి, కాలా రెండు చిత్రాల్లోనూ హీరో దళితుడు అనే విషయం నేరుగా చెప్పరు కానీ.. అతను ఆ కులానికి చెందినవాడన్న విషయం అర్థమవుతుంది. అగ్ర వర్ణాల ఆధిపత్యం మీద పోరాటం నేపథ్యంలోనే ఆ రెండు చిత్రాలూ నడుస్తాయి.
ఐతే కబాలి, కాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాయి. అయినా సరే.. రంజిత్ వెనక్కి తగ్గలేదు. ఈసారి ‘సార్పట్ట’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసారి బాక్సింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం, కథకు కొంచెం కమర్షియల్ టచ్ ఇవ్వడం వల్ల గత రెండు చిత్రాలతో పోలిస్తే ‘సార్పట్ట’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కానీ ఇందులో కూడా హీరో దళితుడిగానే కనిపిస్తాడు. హీరో పెళ్లి టైంలో అతడికి అంబేద్కర్ ఫొటోను బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆ విషయాన్ని చెప్పకనే చెబుతాడు రంజిత్. కుల వివక్ష గురించి పరోక్షంగా చర్చ ఉంటుంది.
తాను దళిత నేపథ్యంలో ఇలా సినిమాలు తీయడమే కాదు.. ‘పరియేరుం పెరుమాళ్’ పేరుతో కుల వివక్ష మీద నిర్మాతగా ఓ సినిమా తీశాడు రంజిత్. ఆ చిత్రంతో పరిచయమైన మారి సెల్వరాజ్ నుంచి వచ్చిన రెండో సినిమా ‘కర్ణన్’ సైతం ఈ వివక్ష నేపథ్యంలోనే నడుస్తుంది. తెలుగులో ఈ నేపథ్యంతో తెరకెక్కిన ‘పలాస 1978’ చిత్రం చూసి రంజిత్ దాని దర్శకుడు కరుణ్ కుమార్‌ను మెచ్చుకోవడం విశేషం. ఒక స్టార్ డైరెక్టర్ ఇంత బలమైన ఐడియాలజీతో ఉంటూ.. ప్రతి సినిమాలోనూ తన భావజాలాన్ని బలంగా చెప్పాలని చూడటం అరుదనే చెప్పాలి.
This post was last modified on July 25, 2021 11:54 am
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…