హాలీవుడ్లో సూపర్ హీరో సినిమాలు సూపర్ పాపులర్. వాటికి ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఆ సినిమాల స్ఫూర్తితో ఇండియాలోనూ కొన్ని సూపర్ హీరో సినిమాలు తెరకెక్కాయి. కానీ మనకంటూ ప్రత్యేకంగా సూపర్ హీరో సినిమాలు తక్కువే. బాలీవుడ్లో హృతిక్ రోషన్ క్రిష్ సిరీస్ సినిమాలతో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
‘క్రిష్’ సిరీస్‌లో త్వరలోనే నాలుగో సినిమా కూడా రాబోతోంది. ఈ జానర్లో తెలుగులో దాదాపుగా సినిమాలు లేవనే చెప్పాలి. అప్పట్లో ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో ‘సూపర్ మ్యాన్’ పేరుతో ఓ సినిమా చేశాడు కానీ.. అదేమంత ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆ సినిమా చూస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది కూడా.
ఐతే ఇప్పుడు టాలీవుడ్లో ప్రపంచ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో టెక్నాలజీని గొప్పగా ఉపయోగించుకుంటూ అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు టాలీవుడ్ దర్శకులు. ఇలాంటి టైంలో సూపర్ హీరో సినిమాలు చేస్తే బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది.
టాలీవుడ్ మ్యాచో మ్యాన్ దగ్గుబాటి రానా ఇప్పుడు అదే ప్రయత్నం చేయబోతున్నాడు. తాను ఓ సూపర్ హీరో సినిమాలో నటించనున్నట్లు రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ ఈ విషయాన్ని వెల్లడించాడతను. కానీ ఈ సినిమాకు దర్శకుడెవరు, ఏ ప్రొడక్షన్లో చేయబోతున్నాడు అన్నది మాత్రం వెల్లడించలేదు.
పవన్ కళ్యాణ్‌తో కలిసి చేస్తున్న ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ తర్వాత తాను నటించబోయే సినిమా ఇదే అని రానా చెప్పడం విశేషం. చివరగా రానా ‘అరణ్య’తో పలకరించాడు. అది డిజాస్టర్ అయింది. అతను ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది.
రానా ఆహార్యానికి సూపర్ హీరో పాత్ర బాగానే సూటయ్యే అవకాశముంది. దేశవ్యాప్తంగా మంచి గుర్తింపున్న రానా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హీరో సినిమా చేస్తే బాగానే వర్కవుట్ అయ్యే అవకాశముంది.
This post was last modified on July 23, 2021 2:10 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…