తెలుగులో వెబ్ సిరీస్‌ల ఊపు అంతగా లేని టైంలో వచ్చిన ఒరిజినల్స్‌లో లాక్డ్ ఒకటి. ఆహా ఓటీటీని మొదలుపెట్టిన కొత్తలో తీసిన కొన్ని వెబ్ సిరీస్‌ల్లో ఇదొకటి. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఈ సిరీస్‌లో లీడ్ రోల్ చేశాడు. న్యూరో స్పెషలిస్ట్ అయిన ఒక డాక్టర్ చుట్టూ తిరిగే కథ ఇది. కొత్త దర్శకుడు ప్రదీప్ దేవకుమార్ మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఉత్కంఠభరితంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దాడు. ఐతే దీనికి సరైన ప్రమోషన్ చేయకపోవడం వల్ల అనుకున్నంత పాపులర్ కాలేదు.
కానీ తెలుగులో వచ్చిన మంచి వెబ్ సిరీస్‌ల్లో ఇదొకటి అనడంలో సందేహం లేదు. ఇప్పుడీ సిరీస్‌కు సీక్వెల్ రాబోతుండటం విశేషం. తెలుగులో ఒక వెబ్ సిరీస్‌కు సీక్వెల్ రాబోతుండటం ఇదే తొలిసారి. వేరే కొన్ని సిరీస్‌లకు కూడా సీక్వెల్ సంకేతాలు వచ్చాయి కానీ.. అవేవీ పట్టాలెక్కలేదు. కానీ ఆహా వాళ్లు లాక్డ్‌కు సెకండ్ సీజన్ తీయడానికి రెడీ అయిపోయారు. ట్విట్టర్లో సత్యదేవ్‌తో ఒక ఆసక్తికర సంభాషణ మొదలుపెట్టి లాక్డ్-2 రాబోతున్న విషయాన్ని వెల్లడించారు.
తొలి సీజన్లో సత్యదేవ్‌తో పాటు సంయుక్త, శ్రీలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఐతే రెండో సీజన్లో సత్యదేవ్ మాత్రమే కొనసాగుతాడట. మిగతా ఆర్టిస్టుల్లో చాలామంది మారిపోతారని తెలుస్తోంది. ఈసారి ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెట్టి సిరీస్ తీయబోతున్నారట. ప్రస్తుతం సత్యదేవ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తిమ్మరసు చిత్రాన్ని పూర్తి చేసిన అతను.. గుర్తుందా శీతాకాలంతో పాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇంత బిజీ టైంలో లాక్డ్ రెండో సీజన్ చేయడానికి డేట్లు కేటాయించడం విశేషమే. అల్లు అరవింద్ వారి ఓటీటీ కోసం సిరీస్ చేయమంటే కాదని ఎలా అనగలడు మరి.
This post was last modified on July 23, 2021 8:42 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…