Movie News

భజరంగి భాయిజాన్.. రాజమౌళి తీసుంటే..?

టాలీవుడ్ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్‌కు బాలీవుడ్లో మంచి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చిన సినిమా ‘భజరంగి భాయిజాన్’. ‘బాహుబలి: ది బిగినింగ్’ రిలీజైన కొన్ని రోజులకే విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. రొటీన్ రొడ్డ కొట్టుడు సినిమాలు చేసే సల్మాన్‌.. ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. సల్మాన్‌కు ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అతడి తండ్రి, లెజెండరీ రైటర్ సలీమ్ ఖాన్ ఎంతో సంతోషించి విజయేంద్ర ప్రసాద్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఐతే విజయేంద్ర ప్రసాద్.. ముందుగా ఈ కథను రాజమౌళి తీస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. తన కొడుక్కి ఈ కథ కూడా చెప్పాడట. కానీ రాజమౌళి ఈ సినిమా తాను చేయనని చెప్పడంతో కథను మాత్రం సల్మాన్ ఖాన్‌కు ఇచ్చేయగా.. కబీర్ ఖాన్‌తో డైరెక్ట్ చేయించినట్లు విజయేంద్ర వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్ర ఈ విషయం చెప్పాడు.

సల్మాన్‌కు కథ చెప్పాక.. రాజమౌళికి ‘భజరంగి భాయిజాన్’ స్టోరీ వినిపించానని.. ఆ కథ తన కొడుక్కి కూడా బాగా నచ్చిందని.. ఐతే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తావా అని అడిగితే మాత్రం తాను చేయనని రాజమౌళి చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఐతే ‘భజరంగి భాయిజాన్’ విడుదలయ్యాక తాను ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనందుకు ఫీలవుతున్నట్లు చెప్పాడని.. రాజమౌళి సరైన మూడ్‌లో లేనపుడు తాను ఈ కథ చెప్పడం తప్పయిందని విజయేంద్ర తెలిపాడు.

‘బాహుబలి’ కోసం ఎర్రటి ఎండలో వెయ్యిమందికి పైగా ఆర్టిస్టులతో భారీ యుద్ధ సన్నివేశాలను రాజమౌళి తెరకెక్కిస్తున్న సమయంలో తాను అతడికి ఈ కథ చెప్పానని.. బ్యాడ్ మూడ్‌లో ఉండటంతో తాను ఈ సినిమాను డైరెక్ట్ చేయలేకపోయానని రాజమౌళి తనకు తర్వాత చెప్పాడని విజయేంద్ర తెలిపాడు. ఇక ఒకప్పుడు రాజమౌళి తన స్థాయిలో విజయవంతం కావాలని కోరుకునేవాడినని.. కానీ ఇప్పుడు అతడి స్థాయిని తాను అందుకోవడానికి కష్టపడుతున్నానని విజయేంద్ర చెప్పడం విశేషం.

This post was last modified on July 22, 2021 11:21 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

9 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

9 hours ago