సోలో బ్రతుకే సో బెటర్ అంటూ.. పెళ్లిపై ఎక్కడలేని వ్యతిరేకత చూపిస్తున్నాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. ఈ సినిమా టైటిల్ చూస్తేనే కాన్సెప్ట్ ఏంటో అర్థం అయిపోయింది. తర్వాత టీజర్ రిలీజ్ చేసి మరింత స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు సినిమా నుంచి నో పెళ్లి అంటూ ఒక థీమ్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. పెళ్లి వద్దే వద్దంటూ హీరో ఉపదేశం చేసే పాట ఇది. ఐతే ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్న తేజు.. ఈ పాటను తనే రిలీజ్ చేసుకోవడమో, మరో సింగిల్ బాయ్‌ని చూసి పని అప్పగించడమో చేయకుండా.. త్వరలోనే పెళ్లికొడుకు కాబోతున్న నితిన్‌కు అప్పగించాడు. షాలిని అనే అమ్మాయితో నితిన్‌కు ఆల్రెడీ నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే. పెళ్లికి కూడా సన్నాహాలు చేసుకున్నారు. లాక్ డౌన్ లేకుంటే పెళ్లి కూడా అయిపోయేది.
త్వరలోనే మంచి ముహూర్తం చేసుకుందాం అనుకుంటున్న నితిన్‌తో.. పెళ్లి వద్దంటూ ఉపదేశం చేసే పాటను లాంచ్ చేయిస్తున్నాడు తేజు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ పాట విడుదల కాబోతోంది. శనివారం ఉదయం వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట గురించి తేజు ఓ ట్వీట్ వేసిన సంగతి తెలిసిందే. దానికి వరుణ్ బదులిస్తూ దానికి ఇంకా చాలా సమయం ఉందన్నాడు. తన సంగతలా వదిలేస్తే.. ఎప్పుడూ మీతోనే ఉంటా అని మాటిచ్చిన రానా దగ్గుబాటి, నితిన్ ఉన్నట్లుండి సింగిల్ క్లబ్ నుంచి వెళ్లిపోయారంటూ మొర పెట్టుకున్నాడు. దీంతో నితిన్ లైన్లోకి వచ్చాడు. బాధపడకండి, మీ నంబర్ కూడా వస్తుందని అన్న నితిన్.. తన పుట్టిన రోజుకు తేజు ఇస్తానన్న బహుమతి సంగతి ఏంటి అని ప్రశ్నించాడు. బదులుగా తేజు గిఫ్ట్ పంపించానంటూ ఈ పాట సంగతి చెప్పాడు. సుబ్బు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అంతా అనుకున్న ప్రకారం లాక్ డౌన్ లేకుంటే ఈ సినిమా ఈపాటికి రిలీజ్ కూడా అయిపోయేది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.
This post was last modified on May 24, 2020 1:04 am
గుమ్మనూరు జయరాం… బడుగు వర్గాల నుంచి వచ్చి ఏకంగా మంత్రి స్థాయికి ఎదిగిన నేతగా ఓ రేంజి రికార్డు ఆయన…
ఏపార్టీలో అయినా.. అధినేత ఒక మెట్టు దిగి వస్తే.. కార్యకర్తలు, నాయకులు రెండు మెట్లుదిగి వచ్చి అధినే తకు అనుకూలంగా…
అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు పైగానే…
మొన్నటి ఏడాది నాని హాయ్ నాన్నతో ఎమోషనల్ హిట్టు కొట్టిన దర్శకుడు శౌర్యువ్ కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే సస్పెన్స్…
ఈ రోజుల్లో సౌత్ ఇండియన్ సినిమాలన్నీ దాదాపుగా థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఏవో కొన్ని పాన్ ఇండియా…
https://www.youtube.com/watch?v=YH6k5weqwy8 అమీర్ ఖాన్ గంపెడాశలు పెట్టుకున్న సితారే జమీన్ పర్ ట్రైలర్ విడుదలయ్యింది. రిలీజ్ డేట్ ఇంకా నెల రోజులకు…