తెలుగు సినిమాల్లో హీరో అంటే ఎంతో అందంగా ఉండాలి. చేసే పాత్ర ఎలాంటిదైనా సరే.. గ్లామర్ తగ్గకూడదు. ఒక మెకానిక్ క్యారెక్టర్ చేసినా కూడా.. చక్కటి హేర్ స్టైల్, నీట్‌గా ఉండే డ్రెస్‌తోనే కనిపిస్తారు. హీరో ఎంత పేదవాడిగా కనిపించినా గ్లామర్ మెయింటైన్ చేసేలా చూడటం మన వాళ్లకే చెల్లుతుంది. ఒక భాషలో ఓ హీరో చాలా సాధారణంగా కనిపించిన సినిమాను రీమేక్ చేస్తున్నపుడు మన వాళ్లు కామన్‌గా చేసే మార్పు.. హీరోను గ్లామరస్‌గా చూపించడం. ఐతే కొన్ని కథలు, పాత్రల విషయంలో ఈ మార్పులు నడిచిపోతాయి. కానీ కొన్ని చిత్రాల విషయంలో ఇలాంటి ఛేంజెస్ పాత్ర ఔచిత్యమే దెబ్బ తినేలా చేస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ.. నారప్ప సినిమానే.
ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ ‘అసురన్’కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్లో ధనుష్ చేసిన పాత్రను ఇక్కడ వెంకీ చేశాడు. ఐతే తమిళంలో ఆద్యంతం ఎంతో ఎమోషనల్‌గా, హృద్యంగా అనిపించే ‘అసురన్’ తెలుగులోకి వచ్చేసరికి అంత ప్రభావవంతంగా కనిపించలేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఉన్న ఆత్మను పట్టుకోవడంలో, అందులోని ఫీల్‌ను ఇక్కడ తీసుకురావడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విఫలమయ్యాడు. హీరో క్యారెక్టర్‌ను చూపించే విషయంలో జాగ్రత్త పడకపోవడమే చేటు చేసింది.
హీరో అందులో సారా కాచేవాడు. పేదవాడు. అలాంటి వ్యక్తి ఎలా కనిపించాలి. చాలా సాధారణమైన బట్టలు వేయాలి. తన ఆహార్యం పట్ల ఏమీ శ్రద్ధ లేనట్లు కనిపించాలి. రఫ్ లుక్‌తో ఉండాలి. కానీ వెంకీకి మాత్రం డిజైనర్ షర్టులేయించారు. ఇస్త్రీ చేసిన పట్టు పంచెలు కట్టించారు. క్లీన్ షేవ్.. స్టైలింగ్ చేసిన హేర్‌తో చూపించారు. ఓవైపు కుల అసమానతలు, రాజు-పేద తారతమ్యాల గురించి చర్చిస్తూ హీరోను ఇలా చూపిస్తే ప్రేక్షకుల్లో ఎలా ఎమోషన్ వస్తుంది? హీరో పరిస్థితి పట్ల మనకు ముందు జాలి కలిగితే కానీ ఈ ఎమోషన్ పండదు.
కానీ ‘నారప్ప’లో కథానాయకుడు కనిపించే విధానం వల్ల మనకు ఆ ఫీలే రాదు. ఫలితంగా ఫ్లాష్ బ్యాక్ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. గత కొన్నేళ్లలో మన ప్రేక్షకుల అభిరుచి ఎంతో మారి హీరో ఎంత డీగ్లామరస్‌గా, లోపాలతో కనిపించినా కూడా ఆమోదిస్తున్నారు. ‘రంగస్థలం’ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ప్రేక్షకులు ఎంతో మారాక కూడా హీరోలు, ఫిలిం మేకర్స్ పాత ఆలోచనలతో ఉండటంలో అర్థం లేదు. ఇకనైనా పాత్రతో సంబంధం లేకుండా హీరోను అత్యంత ఆకర్షణీయంగా చూపించే పాత పద్ధతులకు చరమగీతం పాడితే మంచిది.
This post was last modified on %s = human-readable time difference 9:37 pm
మూసీ నది ప్రక్షాళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నదిని సుందరీకరించి తీరుతామని చెప్పారు.…
డిజాస్టర్ స్ట్రీక్‌కు తెరదించుతూ ‘క’ మూవీతో మంచి హిట్టే కొట్టాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. మీటర్, రూల్స్ రంజన్…
టాలీవుడ్లో మొదటిసారి ఒక కంప్లీట్ మనీ క్రైమ్ ఆధారంగా రూపొందిన లక్కీ భాస్కర్ ఇంకా వంద కోట్ల మైలురాయి అందుకోలేదు.…
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను అనుసరించి.. దేశవ్యాప్తంగా ఎస్సీల…
మొన్నటి ఏడాది సప్తసాగరాలు దాటి సైడ్ ఏబిలో హీరోయిన్ రుక్మిణి వసంత్ కి మన ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు.…
ధర్మవరం పట్టణంలోని చిక్క వడియార్ చెరువును వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్రమించారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి…